Healthy Breakfast Items | నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా ఉదయం చాలా మంది సరిగ్గా ఆహారం తినడం లేదు. బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే రోజులో మనం ఉదయం తినే ఆహారం మన ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఏది పడితే అది తినకూడదు. అలాగని చెప్పి పూర్తిగా మానేయకూడదు. రెండింట్లో ఏది చేసినా మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కనుక ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తినాల్సి ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, రోజంతటికీ మనకు కావల్సిన పోషకాలను, శక్తిని అందిస్తుంది. ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్‌ను తింటే మనం ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటాము. చురుగ్గా పనిచేస్తాము. కనుక ఉదయం తీసుకునే ఆహారంపై కచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లను తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో కోడిగుడ్లను తింటే కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆ రోజులో మిగిలిన సమయంలో తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది. దీని వల్ల శరీరానికి చేరే క్యాలరీలు తగ్గుతాయి. అలాగే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కోడిగుడ్లు మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన ప్రోటీన్లతోపాటు ఇతర పోషకాలను కూడా అందజేస్తాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లను తినడం మంచిది. దీంతో రోజంతా యాక్టివ్‌గా కూడా ఉండవచ్చు. చురుగ్గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.
బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్‌గా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఓట్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతోపాటు రక్తపోటు, ఊబకాయం, గుండె సమస్యలు ఉన్నవారికి ఓట్స్ మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకుని తినడం లేదా ఉప్మాలాగా తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నట్స్ తినడానికి రుచిగా ఉండడమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్‌లో క్యాలరీలు చాలా ఉన్నప్పటికీ కొవ్వు ఏమాత్రం రాదు. బరువు తగ్గడానికి నట్స్ చాలా ఉపయోగపడతాయి. వీటిల్లో మెగ్నిషియం, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషకాలను అందజేస్తాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా నట్స్‌ను తీసుకుంటే మనకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే అవిసె గింజలను కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునేలా చేస్తాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షణను అందిస్తాయి. కనుక అవిసె గింజలను రోజూ తినాలి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా పండ్లను తినడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇవి మనకు శక్తిని అందివ్వవడమే కాదు పోషకాలను కూడా ఇస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లను తింటే రోజంతా చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. పండ్లలో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి కావల్సిన ఫైబర్‌ను సైతం అందిస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. బరువు తగ్గతారు. అయితే ఉదయం ఏ పండ్లను పడితే ఆ పండ్లను తినకూడదు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు నిమ్మ జాతి పండ్లను తినరాదు. ఇతర ఏ పండ్లను అయినా సరే తినవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.