ఎర్రటి రంగుతో ఆకర్షణీయంగా కనిపించే రాంబూటాన్ పండు లిచీ పండ్లకు దగ్గరగా ఉంటుంది. ఇది ఉష్ణమండలంలో ఉన్న ఆగ్నేయాసియా దేశాలకు స్థానికమైంది.
ఎర్రటి రంగుతో ఆకర్షణీయంగా కనిపించే రాంబూటాన్ పండు లిచీ పండ్లకు దగ్గరగా ఉంటుంది. ఇది ఉష్ణమండలంలో ఉన్న ఆగ్నేయాసియా దేశాలకు స్థానికమైంది. ఇందులో కెలోరీలు తక్కువగా, నీళ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
రాంబూటాన్లో నీళ్లు, ఫైబర్ ఉన్నందువల్ల వీటిని తింటే ఎక్కువసేపు కడుపు నిండినట్టుగా ఉంటుంది. దాంతో అతిగా ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటుంది. ఊబకాయులకు ఇదొక వరం. బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుంది.
ఈ పండు నీళ్లలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్స్కు గని. నీళ్లలో కరగని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక నీళ్లలో కరిగే ఫైబర్ పొట్టలో బ్యాక్టీరియాకు మేలుచేస్తుంది.
ఇందులో ఉండే నియాసిన్ విటమిన్ బి3 మన శరీరంలో జీవక్రియలను ప్రేరేపిస్తుంది. అలా శరీరం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతర్గత రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
కొవ్వులో కరిగే ఎ, డి, ఇ, కె విటమిన్లు కూడా రాంబూటాన్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను చైతన్యపరుస్తాయి. ఇందులోని విటమిన్-సి శరీరంలో తెల్ల రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వయసు మీద పడకుండా చూస్తుంది.
రాంబూటాన్ తొనలో ఎలాజిటనిన్ జెరానిన్ అనే పాలిఫినాలిక్ కాంపౌండ్ ఉంటుంది. ఇది జీవక్రియలు మందగించడానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆహారంలో అధిక కొవ్వు వల్ల తలెత్తే సమస్యలను నివారిస్తుంది.