Healthy Eating | ఆరోగ్యంగా ఉండాలనే ఆశ ఉంటే అలవాట్లను మార్చుకునే పని మొదలుపెట్టాలి.అలవాట్లు మార్చుకోవాలంటే ఆహారం పట్ల, అవసరాల పట్ల అవగాహన ఉండాలి. ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? తెలుసుకున్నట్టుగానే.. తింటే అరగడానికి ఎంత సమయం పడుతుందో కూడా అవగాహన ఉండాలి. లేకుంటే తిన్నది ఖర్చు కాకముందే మళ్లీ తింటే అరగదు. తిన్నదీ ఒంటబట్టదు. హాయిగా నిద్రపట్టాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మితంగా తినాలి. ఆయా పదార్థాలు జీర్ణమయ్యే కనీస సమయాల వివరాలివి. ఈ లెక్కల ఆధారంగా చిక్కుల్లేకుండా ఆరగింపు సేవలో తరించండి.
40 నిమిషాలు సంక్లిష్టమైన ఆహారాన్ని జీర్ణవ్యవస్థ ఎంజైముల సహకారంతో సరళమైన ఆహారంగా మారుస్తుంది. కూరగాయలను ఉడికించడం వల్ల ఇలాంటి మార్పు కొంత జరుగుతుంది. పచ్చి కూరగాయల కంటే ఉడికించిన కూరగాయలు తొందరగా జీర్ణమవుతాయి.
30 నుంచి 40 నిమిషాలు కార్బొహైడ్రేట్లతోపాటు విటమిన్లు, ఖనిజ పోషకాలు కూరగాయల్లో అధికంగా ఉంటాయి. వీటితోపాటు యాంటి ఆక్సిడెంట్లు కూడా కూరగాయల నుంచి లభిస్తాయి. కొవ్వులు అతిస్వల్పంగా ఉంటాయి. 100 గ్రాముల కూరగాయల్లో 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కాబట్టి తేలికగా, తొందరగా జీర్ణం అవుతుంది.
30 నిమిషాలు గుడ్డు తేలికైన ఆహారమే! ఇందులోని తెల్లసొన మాత్రమే తీసుకుంటే అరగంటలో జీర్ణం అవుతుంది. గుడ్డు మొత్తం తిన్నారనుకోండి ఇంకో పదిహేను నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.
15-20 నిమిషాలు నీటి శాతం అధికంగా ఉండి, కొవ్వులు అతి స్వల్పంగా ఉండటం వల్ల పండ్లు వేగంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ఎంజైములు జీర్ణక్రియను మరింత వేగవంతం చేస్తాయి.
మంచినీళ్లలో పోషకాలు ఉండవు. కాబట్టి జీర్ణరసాలతో కూడిన జీర్ణక్రియ కూడా అవసరం లేదు. అందువల్ల తాగిన నీళ్లు తాగినట్టే జీర్ణాశయం నుంచి పేగుల్లోకి జారుకుంటాయి.
90-120 నిమిషాలు ఆలుగడ్డల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌లకు అంత తొందరగా లొంగవు. ఆలుగడ్డతో వండిన ఆహార పదార్థాలు నిదానంగా జీర్ణం అవుతాయి.
3-4 గంటలుమాంసంలో కొవ్వులతోపాటు మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
180 నిమిషాలు ఇవి సూక్ష్మ పోషకాల గనులు. విటమిన్లు, ఖనిజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నట్స్‌లో 54 గ్రాముల కొవ్వులు, 21 గ్రాముల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.
45 నుంచి 60 నిమిషాలు సాధారణంగా మాంసాహారం అంటే అధికంగా కొవ్వు ఉండేవని భావిస్తాం. కానీ, చేపల్లో కొవ్వులు తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల చేప మాసంలో 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. డ్రైఫ్రూట్స్‌లో ఉండే కొవ్వుల కంటే ఇది తక్కువ. అందుకే ఇతర మాంసాహార పదార్థాల కన్నా ఇది తేలికగా జీర్ణమవుతుంది.
120 నిమిషాలు పాలలో 4-5 శాతం కొవ్వులు ఉంటాయి. అలాగే 4-5.5 శాతం మాంసకృత్తులు ఉంటాయి. పాలలో లాక్టోజ్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయంలోని ఎంజైమ్‌లు ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాలతో తయారుచేసిన తక్కువ కొవ్వు ఉండే జున్ను, వెన్న తీసిన పాలు, మిల్క్ ఐస్‌క్రీమ్‌లు జీర్ణం కావడానికి గంటన్నర సమయం పడుతుంది.