Health Tips | ఏ వ్యాధులు ఉంటే ఏ ఆహారం ప్రమాదమో తెలుసా.. తెలియదంటే ఇప్పుడు తెలుసుకోండి..!
Health Tips | సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం పునాది లాంటిదని అందరికీ తెలుసు. అయితే మనం తీసుకునే ప్రతి ఆహారం అందరిపైనా ఒకే రకమైన ప్రభావం చూపదు. కొన్ని రకాల ఆనారోగ్య సమస్యలు (Health Issues) ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనవిగా భావించే ఆహారపదార్థాలు కూడా హాని కలిగించవచ్చు. వ్యాధిని బట్టి ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించడం చికిత్సలో ఒక కీలకమైన భాగంగా వైద్యులు సూచిస్తున్నారు.
Health Tips : సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం పునాది లాంటిదని అందరికీ తెలుసు. అయితే మనం తీసుకునే ప్రతి ఆహారం అందరిపైనా ఒకే రకమైన ప్రభావం చూపదు. కొన్ని రకాల ఆనారోగ్య సమస్యలు (Health Issues) ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనవిగా భావించే ఆహారపదార్థాలు కూడా హాని కలిగించవచ్చు. వ్యాధిని బట్టి ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించడం చికిత్సలో ఒక కీలకమైన భాగంగా వైద్యులు సూచిస్తున్నారు. సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు. మరి ఏ వ్యాధులు ఉంటే ఏ ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు స్వీట్లు, చక్కెర పానీయాలు, మైదా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగవంతంగా పెంచుతాయి.
అధిక రక్తపోటు బాధితులు ఉప్పు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఊరగాయలు వంటి సోడియం అధికంగా ఉండే పదార్థాలను మానుకోవాలి. లేదంటే శరీరంలో నీరు నిల్వ ఉండి రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
గుండె జబ్బులు ఉన్నవారు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన మాంసం, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.
ఇక కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు పాలకూర, రాగులు, జీడిపప్పు, డార్క్ చాక్లెట్ వంటివి తినకపోవడమే మంచిది. వీటిలోని ఉండే ఆక్సలేట్లు కాల్షియంతో కలిసి రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
గౌట్ సమస్యతో బాధపడేవారు రెడ్ మీట్, కొన్ని రకాల సముద్ర చేపలు, మద్యానికి దూరంగా ఉండాలి. వీటిలోని ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచి కీళ్ల నొప్పులు, వాపులకు దారితీస్తాయి.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్, మద్యపానాన్ని పూర్తిగా మానుకోవాలి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తాయి.
గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు కారం, మసాలాలు, కాఫీ వంటివి తగ్గిస్తే ఉపశమనం లభిస్తుంది. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు గోయిట్రోజెన్లు ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆహారాలను వైద్యుల సలహా మేరకు పరిమితంగా తీసుకోవాలి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చు.
కాబట్టి ఆహారం విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏది తినాలో, ఏది తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే, వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు ఆహార ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sivakarthikeyan | షూటింగ్‌లోనే దర్శకుడికి ఖరీదైన బహుమతి.. శివకార్తికేయన్ మంచి మనసుపై నెటిజన్ల ప్రశంసలు!
పిల్లలు పుట్టలేదని బాబును దత్తత తీసుకుని పెంచుకోవడం తప్పా? : వీడియో
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

