ప్రతి ఆసనానికి ఒక నిర్ద్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు నిత్యం యోగా సాధన చేయడం వల్ల ప్రసవం సులభం అవుతుంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణులు సాధన చేయగలిగే ప్రత్యేక ఆసనాల్లో బద్ధ కోణాసనం ఒకటి.
లాభాలు: ఆస్తమాతో బాధపడుతున్నవారికి ఈ ఆసనం ఎంతో ప్రయోజనకారి. పిక్క కండరాలు బలపడతాయి. తుంటి ఎముకలు దృఢంగా మారుతాయి. నడుము కింది భాగాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. గర్భిణులు ఈ ఆసనం సాధన చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు మెరుగు పడుతాయి.
చేయకూడనివారు: కండ్లు తిరుగుతున్నా, వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా, ఆయాసంగా ఉన్నా ఈ ఆసనం ప్రయత్నించొద్దు. డాక్టర్ సలహా తర్వాతే సాధన ప్రారంభించాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109