Coconut | కొబ్బరిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో పచ్చడి, చట్నీలు చేస్తుంటారు. కూరల్లో, రైస్ వంటకాల్లోనూ కొబ్బరిని వేస్తుంటారు. కొందరు పచ్చి కొబ్బరిని వాడితే, కొందరు ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు. అయితే కొబ్బరిని రోజూ నేరుగా తినవచ్చు. పచ్చి కొబ్బరిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ ఒక కప్పు మోతాదులో తింటే అనేక లాభాలు కలుగుతాయి. దీని వల్ల పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ పచ్చి కొబ్బరిని తింటుంటే ఫలితం ఉంటుంది.
పచ్చి కొబ్బరిలో మీడియం-చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంసీటీ) అధికంగా ఉంటాయి. ఇవి తేలిగ్గా, త్వరగా జీర్ణం అవుతాయి. వీటి వల్ల లివర్‌లో శక్తి త్వరగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీరానికి శక్తి అందుతుంది. ఈ శక్తి కొవ్వు రూపంలో నిల్వ ఉండదు. శరీరంలో తక్షణమే ఖర్చవుతుంది. అందువల్ల పచ్చి కొబ్బరిని తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నీరసం, అలసట ఉండవు. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. పచ్చి కొబ్బరిలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో అనేక విధులను సక్రమంగా నిర్వర్తించడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు.
పచ్చి కొబ్బరిలో అధికంగా ఉండే మాంగనీస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే కాపర్ వల్ల శరీరం ఐరన్‌ను సరిగ్గా శోషించుకుంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. పచ్చి కొబ్బరిలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. పచ్చి కొబ్బరిలో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. పచ్చి కొబ్బరిలో అధికంగా ఉండే పొటాషియం శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. ఇలా పచ్చి కొబ్బరిలో ఉండే ఆయా మినరల్స్ అనేక రకాలుగా మనకు ఉపయోగపడతాయి.
పచ్చి కొబ్బరిలో ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. వీటి వల్ల ఫ్రీ ర్యాడికల్స్ తొలగించడతాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో ఉండే ఎంసీటీలు యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. కనుక ఈ కొబ్బరిని తింటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇలా పచ్చి కొబ్బరిని రోజూ ఒక కప్పు మోతాదులో తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.