Sattu Tikki : దేశంలో పాపులర్ స్నాక్‌గా పేరొందిన టిక్కీలను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటుంటారు. రుచికరమైన, సంప్రదాయ టిక్కీలను అందరూ ఇష్టపడినా, అమితంగా తింటే ఆహారానికి ఏమంత మేలు చేయవు. డీప్ ఫ్రైతో చేసే ఈ స్నాక్స్ తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు, బరువు పెరిగే ప్రమాదమూ పొంచిఉంది.
అయితే అందరికీ ఇష్టమైన ఈ స్నాక్‌ను పోషకాలతో కూడిన పదార్ధాలను జోడించడం ద్వారా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్లాసిక్ రెసిపీలో వేయించిన శనగపప్పు, మసాలా దినుసులను జోడిస్తే అవి ఆరోగ్యకర పోషకాలతో నిండిఉంటాయి.
శనగపిండి కంటే వేయించిన శనగపప్పు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఇందులో శరీరానికి శక్తిని సమకూర్చే ప్రొటీన్, జీర్ణక్రియ సాఫీగా సాగేలా ఫైబర్ ఉండటంతో ఆరోగ్యకర ప్రత్యామ్నాయామని న్యూట్రిషనిస్టలు చెబుతున్నారు.
Read More :