Honey | జుట్టుకు తేనె!.. కేశ సమస్యలకు తేనెతో పరిష్కారం
తేనెలోని ఔషధ లక్షణాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆధునిక వైద్య విజ్ఞానం సైతం ఆ సుగుణాలను ఆమోదించింది. కేశ సమస్యలకూ తేనె పరిషారం చూపుతున్నది.
Honey | తేనెలోని ఔషధ లక్షణాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆధునిక వైద్య విజ్ఞానం సైతం ఆ సుగుణాలను ఆమోదించింది. కేశ సమస్యలకూ తేనె పరిషారం చూపుతున్నది.
తేనె, కొబ్బరి నూనె.. రెండిటినీ సమపాళ్లలో కలిపి జుట్టుకు పట్టిస్తే వాటిలోని విటమిన్లు, ఖనిజాలు
కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. ఈ మిశ్రమాన్ని దాదాపు 20 నిమిషాలు అట్టే ఉంచిన తర్వాత చన్నీళ్లతో కడిగేసి తలస్నానం చేయాలి. దీనివల్ల కేశాలు రాలడం తగ్గిపోతుంది, కొత్త మెరుపూ వస్తుంది.
ఒక పండిన అవకాడో, అరకప్పు పెరుగు, రెండు స్పూన్ల తేనె.. ఈ మూడింటి మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చాలా ఉపయోగం. అవకాడోలోని ఫ్యాటీ యాసిడ్స్, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ జుట్టుకు మేలు చేస్తాయి.
ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సౌందర్య ఉత్పత్తి- అర్గాన్ నూనె. మొరాకో, అల్జీరియాల్లో కనిపించే అర్గాన్ చెట్టు నుంచి తీసే ఈ తైలంలో అరుదైన పోషకాలు ఉన్నాయని చెబుతారు. ఇక అలోవెరా చర్మానికి ఎంత మేలు చేస్తుందో చెప్పనక్కర్లేదు. పావు కప్పు అలోవెరా జెల్లో రెండు స్పూన్ల అర్గాన్ తైలం, స్పూన్ తేనె కలిపి పట్టిస్తే దృఢమైన కేశాలు మన సొంతం.