Silver Plates | ఇప్పుడంటే చాలా మంది ప్లాస్టిక్ లేదా స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కానీ మన పూర్వీకులు ఎక్కువగా వెండి ప్లేట్లను భోజనం చేసేందుకు వాడేవారు. కాస్త స్థోమత కలిగి ఉన్న చాలా మంది అప్పట్లో భోజనం చేసేందుకు వెండి ప్లేట్లనే ఉపయోగించే వారు. ఆయుర్వేద ప్రకారం వెండిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన ఆహారంలో ఉండే బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అవకుండా చూసుకోవచ్చు. అలాగే వెండి పాత్రల్లో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్లేట్లలో భోజనం చేస్తే కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి ఆణువులు మన శరీరంలో చేరితే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల మన శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటంచేస్తుంది. వ్యాధులు తగ్గిపోతాయి. వెండి పాత్రల్లో భోజనం చేయడం వల్ల ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఆహారం మరింతగా రుచిగా ఉంటుంది. ఆకలి లేని వారు ఈ పాత్రల్లో తింటుంటే క్రమంగా ఆకలి పెరుగుతుంది. వెండిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెండి ప్లేట్లలో భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయంపై వెండి చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో శరీరం చల్లదనాన్ని పొంతుతుంది. అలాగే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడదు. అలాగే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. వేసవిలో వెండి ప్లేట్లలో భోజనం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరం చల్లగా ఉంటుంది. వేసవితాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. వేడి వాతావరణం ఉంటే కచ్చితంగా వెండి ప్లేట్లలో భోజనం చేయాలి.
వెండి ప్లేట్లలో తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. వెండి ప్లేట్లలో భోజనం చేస్తే ఆ లోహపు అణువులు మన శరీరంలో చేరుతాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. మన ఆయుర్దాయం పెరిగేలా చేస్తాయి. మన పూర్వీకులు వెండి ప్లేట్లలో తినేవారు. కనుకనే వారు ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవించి ఉండగలిగారు. ఇలా వెండి ప్లేట్లలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక 100 ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వెండి ప్లేట్లలో భోజనం చేయడం ఇప్పటి నుంచే ప్రారంభించండి.