Gooseberry Benefits | చలికాలం మొదలవగానే మనకు ఉసిరికాయలు విరివిగా లభిస్తుంటాయి. ఉసిరికాయలను పోషకాలకు గనిగా చెబుతారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానంలో ఉసిరిని ఎన్నో వేల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక ఔషధాల తయారీలో వాడుతుంటారు. ఉసిరికాయల్లో అనేక విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజూ ఒక ఉసిరికాయను ఈ సీజన్లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఉసిరికాయను విటమిన్ సి కి నెలవుగా చెప్పవచ్చు. విటమిన్ సి ఈ కాయల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంల ఎంతగానో సహాయం చేస్తుంది. ఉసిరికాయలను తినడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కాయల్లో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. దీని వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఉసిరికాయలను తరచూ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. ముఖం మీది ముడతలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది.
జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ ఉసిరికాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉసిరికాయల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. ఉసిరికాయలను తింటే జీర్ణాశయంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాలను సులభంగా జీర్ణం చేస్తాయి. ఉసిరికాయలను తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో బరువును నియంత్రించడం తేలికవుతుంది. ఉసిరికాయల్లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయలేదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఉసిరికాయలను తినడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
ఉసిరికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు. అలాగే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఉసిరికాయలను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయలను తినడం వల్ల శిరోజాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. ఉసిరికాయలతో జుట్టు దృఢంగా మారుతుంది. చుండ్రు తగ్గుతుంది. జుట్టు తెల్లబడకుండా నిరోధించవచ్చు. ఉసిరికాయలను తింటే జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే పోషకాలు లభిస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి కాంతివంతంగా మారుతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఉసిరికాయల్లో క్రోమియం అనే మూలకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉపయోగించుకుటుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. ఉసిరికాయలను రోజూ ఒకటి చొప్పున తింటుంటే మధుమేహుల్లో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇలా ఉసిరికాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని ఈ సీజన్లో మరిచిపోకుండా రోజుకు ఒకటి చొప్పున తినండి.