Google Connect | అమెరికా టెక్ దిగ్గజం గూగుల్.. తన హెల్త్ కనెక్ట్ యాప్‌ను సోమవారం విడుదల చేసింది. ఆరోగ్యం, ఫిట్నెస్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని ఒకే యాప్‌లో సంపూర్ణ ఆరోగ్య విషయాలను పొందేందుకు గూగుల్ వీలు కల్పించింది. వివిధ ఫిట్నెస్, హెల్త్, వెల్బీంగ్ యాప్‌లను కనెక్ట్ చేసుకోవడానికి ఈ యాప్ అనుమతిస్తుంది. గూగుల్ హెల్త్ కనెక్ట్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నది. అయితే, బీటా వెర్షన్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ సహకారంతో గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ను రూపొందించారు. వివిధ రకాల హెల్త్, ఫిట్నెస్ యాప్‌ల నిర్వహణకు బదులుగా అవి అందించే అన్నిరకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందే వీలున్నది. హెల్త్ కనెక్ట్ వినియోగదారులు ఆండ్రాయిడ్ డివైసెస్‌లో ఆరోగ్యం, ఫిట్నెస్ డాటాను షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్‌లో క్రెడిట్ పొందేందుకు వినియోగదారులు వేరే యాప్‌లో చేసిన వర్కవుట్ డాటాను ఈ యాప్‌తో షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ప్రకారం, ప్రస్తుతం 10 కి పైగా ఆరోగ్యం, ఫిట్నెస్, వెల్బీంగ్ యాప్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫాంతో అనుసంధానించారు. వీటిలో మైఫిట్నెస్పాల్, ఆరా, పెలోటాన్, శాంసంగ్ హెల్త్, ఫిట్‌బిట్ వంటి యాప్‌లు ఉన్నాయి.