చెమట చెప్పేస్తుంది.. గ్లూకోజ్ ఎంతో!

- వినూత్న విధానం అభివృద్ధి
- ఇంజెక్షన్ బాధ లేకుండా పరీక్ష
- మధుమేహ రోగులకు ప్రయోజనం
న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపించుకోవాల్సి వస్తుంటుంది. ఇకపై ఆ బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే చెమట ద్వారా సులభంగా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారించే సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి చెమట ద్వారా గ్లూకోజ్‌ను లెక్కించే విధానాలను ఇప్పటికే కనుగొన్నప్పటికీ.. రక్తంలో కంటే చెమటలో గ్లూకోజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వారివారి శరీర ధర్మాలను బట్టి ఫలితాలు కచ్చితంగా రావడం లేదు. ఈ ప్రతికూలతలను అధిగమిస్తూ శాస్త్రవేత్తలు కొత్త గ్లూకోజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. వేలి మొన నుంచి చెమటను గ్రహించి ఈ పరికరం 95% కచ్చితంగా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Diabetes
- glucose levels
- Sugar
- swat
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

