చాయ్‌లో అంగుళమంత అల్లం దంచి వేసుకుంటే తలనొప్పి పరారవుతుంది, జలుబు మాయమవుతుంది. గృహ చిట్కాల్లో ఘనంగా ఉపయోగపడే అల్లం దీర్ఘకాలిక రుగ్మతలపైనా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని పరిశోధుకులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలు అల్లంలో దండిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణలో కూడా అల్లం తోడ్పడుతుందని పరిశోధకుల మాట. అల్లంలో ఉండే జింజిబర్ ఆఫిసినేల్… ప్రొస్టేట్ గ్రంథిలోని ఆరోగ్యకరమైన కణాలను ఏమీ చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేస్తున్నదని పరిశోధనలో తేలింది. అలా ప్రొస్టేట్ క్యాన్సర్ కణితి పరిమాణాన్ని 56 శాతం తగ్గించిందినట్టు గుర్తించారు.