Health | పాప పుట్టాక నాలో లైంగిక కోరికలు చచ్చిపోయాయి.. ఇప్పుడు ఆ ఊహ కూడా భయంగా అనిపిస్తుంది.. ఎందుకిలా?
Health | నా వయసు ముప్పై. ఆరునెలల క్రితం మాకు ఓ పాప పుట్టింది. అప్పటి నుంచీ నాలో లైంగిక పరమైన కోరికలు చచ్చిపోయాయి. మా ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నా.
Health | నా వయసు ముప్పై. ఆరునెలల క్రితం మాకు ఓ పాప పుట్టింది. అప్పటి నుంచీ నాలో లైంగిక పరమైన కోరికలు చచ్చిపోయాయి. మా ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నా. తను బాగా నిరాశకు గురవుతున్నాడు. గతంలో మా సెక్స్ లైఫ్ చాలా చురుగ్గా ఉండేది. ఎంతో ఉత్సాహంగా వ్యవహరించేదాన్ని. ఇప్పుడు, ఆ ఊహ కూడా భయంకరంగా అనిపిస్తున్నది. ఎందుకిలా? నన్ను జడత్వం ఆవహించిందా? నా భర్త నన్ను ఆకట్టుకలేక పోతున్నాడా?.. నా మెదడు నిండా సందేహాలే. మీరే ఓ సలహా చెప్పాలి.
ఓ పాఠకురాలు
ఓ చిన్న విషయాన్ని మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు. ప్రసవం తర్వాత సగానికిపైగా మహిళలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీ శరీరం అనేకానేక మార్పులకు గురవుతుంది. మనసు కూడా ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావం నుంచి బయటికొచ్చి మనసూ తనువూ సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొందరి విషయంలో అది రెండుమూడు నెలలు కావచ్చు. మరికొందరి విషయంలో ఏడాది అయినా కావచ్చు. మీలో లైంగిక ఆసక్తి సన్నగిల్లడానికి కారణం కూడా అదే. చురుకైన లైంగిక జీవితం అంటే.. మరో బిడ్డకు జన్మనివ్వడమే. అందుకు తగిన సత్తువ మీకు లేదు. కాబట్టే, శరీరం ఏదో ఓ రూపంలో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నది. ఆ సంకేతాలను పాజిటివ్‌గా తీసుకోండి. ఇంకొన్నాళ్లు బిడ్డ పెంపకం మీదే దృష్టిపెట్టండి. పరిపూర్ణమైన ప్రేమను పంచండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- baby
- health tips
- life style
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

