Fruits For Immunity Power | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వివిధ రకాల పండ్లను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది రోజూ పండ్లను తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడినప్పుడు మాత్రమే చాలా మంది పండ్లను తింటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా రోజూ పండ్లను తినాల్సి ఉంటుంది. అయితే ఏ పండ్లను తినాలి, వాటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. సీజన్ల వారిగా లభించే పండ్లను తప్పనిసరిగా తినాలి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను రోజూ తినాలి. వీటి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని అంటున్నారు.
నారింజ పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే మనం రోజూ తినదగిన పండ్లలో నారింజ పండ్లు కూడా ఒకటి. ఈ పండ్లను ప్రతి సీజన్లోనూ, ప్రతి రోజూ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఒక నారింజ పండును తింటే శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సితోపాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో దోహదం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీని వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే రోజూ తినాల్సిన పండ్లలో యాపిల్ కూడా ఒకటి. యాపిల్ పండ్లను సూపర్ ఫ్రూట్‌గా చెబుతారు. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, అనేక బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి.
దానిమ్మ పండ్లను కూడా రోజూ తింటుండాలి. రోజూ తినాల్సిన పండ్లలో ఇవి కూడా ఒకటి. రోజూ ఒక దానిమ్మ పండును లేదా ఒక కప్పు దానిమ్మ గింజలను తినాలి. ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగవచ్చు. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. అలాగే రోజూ తినదగిన పండ్లలో కివి పండ్లు కూడా ఒకటి. వీటిని కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తింటారు. కానీ రోజుకు ఒక కివి పండును తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల విటమిన్ సి అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. కివి పండ్లలో అధికంగా ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు పైన తెలిపిన పండ్లను తినడం మాత్రమే కాకుండా పలు ఇతర సూచనలు కూడా పాటించాల్సి ఉంటుంది. మన శరీరానికి తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవాలి. ఇది కూడా రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. రోజూ కాసేపు సూర్య రశ్మిలో గడపడం లేదా విటమిన్ డి ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఈ విటమిన్‌ను పొందవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఆ శక్తి పెరిగేలా చేసుకోవాలంటే కేవలం వేడి ద్రవాలను మాత్రమే తాగాలి. చల్లని పానీయాలను సేవించకూడదు. ఈ విధంగా ఆయా పండ్లను తింటూ పలు సూచనలను పాటిస్తుంటే రోగ నిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. దీంతో రోగాలు రాకుండా అడ్డుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.