Fruits For Diabetics | ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా ఆందోళన బారిన పడుతున్నారు. దీంతోపాటు ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటోంది. ఇవి డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు అవుతాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా డయాబెటిస్ వచ్చేందుకు మరొక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే షుగర్ వచ్చినవారు డాక్టర్ సలహా మేరకు మందులను వాడడంతోపాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్ బెర్రీలు తదితర బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. అంటే ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవన్నమాట. కనుక ఈ బెర్రీ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్‌ను అదుపులోకి తేవచ్చు. అలాగే రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల కూడా షుగర్ తగ్గుతుంది. యాపిల్ పండ్లలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కనుక షుగర్‌ను తగ్గించేందుకు యాపిల్ పండ్లను కూడా తినవచ్చు.
పియర్స్ అనే పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక ఈ పండ్లను తింటున్నా కూడా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మ వంటి పండ్లను కూడా తింటుండాలి. ఈ పండ్లలో విటమిన్ సి, సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే చెర్రీ పండ్లను కూడా తినవచ్చు. ఇవి తియ్యగా ఉంటాయి కానీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
పీచ్ అనే పండ్లలో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. కాబట్టి ఈ పండ్లను తింటున్నా కూడా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ప్లమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు కివి పండ్లను కూడా తినవచ్చు. ఈ పండ్లలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. కనుక షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ద్రాక్షలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఇలా పలు రకాల పండ్లను తరచూ తింటుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.