Health Tips : సూపర్ ఫ్రూట్‌గా పేరొందిన బనానా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రూట్గా పోషకాల గనిగా ప్రజల మన్ననలు పొందింది. అరటి పండు ఫ్రూట్‌గా, కూరగాయగానూ, భోజనం వడ్డించే ఆకుగానూ పలు రకాలుగా సేవలు అందిస్తుంది. అరటి పండులో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, పలు అత్యవసర మినరల్స్, విటమిన్లు ఉంటాయి. అయితే జలుబు, దగ్గుతో బాధపడే వారు, మధుమేహులు అరటి పండు తీసుకోరాదని చెబుతుంటారు.
అయితే అరటి పండును సరైన మోతాదులో మితంగా, తగిన సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటి పండును కొన్ని ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవడం మాత్రం సరైంది కాదని, అలాంటి అలవాట్లను వదులుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బనానాను పాలతో కలిపి తీసుకోవడం మేలు చేయదని అరటి పండు సహజంగా ఆమ్లత్వంతో కూడినది కాగా, పాలు స్వీట్ అని ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సూర్య భాగవతి తెలిపారు. ఇది సరైన కాంబినేషన్ కాదని పరస్పర విరుద్ధ ఆహారాలను ఒకేసారి కలిపి తీసుకోరాదని అన్నారు. అలాగే అరటి పండును రెడ్ మీట్‌తో పాటు తీసుకోరాదు.
అరటిలో జీర్ణక్రయి సాఫీగా సాగేలా చూసే ప్యురిన్ ఉంటుందని అయితే రెడ్‌మీట్‌లో ఉండే అధిక ప్రొటీన్ జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండూ పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన ఆహారాలను ఒకేసారి తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇక అరటిని బేక్డ్ గూడ్స్ జామ, నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీస్ వంటి సిట్రస్ ఫ్రూట్స్‌తో కలిపి తీసుకోరాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :