న్యూఢిల్లీ : అధిక బరువు వదిలించుకోవాలనుకునే వారు క్యాలరీలు తగ్గించుకునే పనిలో పడుతుంటారు. తక్కువ మోతాదులో తినడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్, మినరల్స్ లోపాలు తలెత్తి అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
శరీరానికి కావలసిన పోషకాహారం అందకుంటే శరీరంలో జీవక్రియల రేటు మందగిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు ఏమాత్రం ఉపకరించదు. ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు మెరుగైన ఆహారం తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు విశాల్ కటారా చెబుతున్నారు.
ఈ ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ కలిగిన కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఆహారంతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు..
కూరగాయలు
అవకాడో
యాపిల్స్
బెర్రీస్
తృణధాన్యాలు, పప్పులు
చియా సీడ్స్
మంచినీరు
బీన్స్