జీవనశైలిలో మార్పులు, ఆహారంలో పోషకాలు లోపించడం, ఇతర కారణాల వల్ల నడి వయసులోనే ఎన్నెన్నో రుగ్మతలు పలకరిస్తున్నాయి. యుక్త వయసులోనే కీళ్ల నొప్పుల బారినపడుతున్నారు. విటమిన్ డి, క్యాల్షియం లోపంతో చాలామంది ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఎముక నిర్మాణంలో క్యాల్షియం ఎంత ముఖ్యమో విటమిన్ డి అంతే ముఖ్యమైనది. ఈ రెండూ సరిపడా అందితేనే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన క్యాల్షియం ఎముకకు చేరాలంటే విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. క్యాల్షియంను చేర్చే క్రమంలో విటమిన్ డి ఒక వాహకంలా పనిచేస్తుంది.
విటమిన్ డి తగినంత లేకుంటే ఆహారం, సప్లిమెంట్స్ ద్వారా ఎంత క్యాల్షియం తీసుకున్నా వ్యర్థమవుతుంది. అందుకే క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా శరీరానికి అందించాలి. నిజానికి మన చర్మంలో
క్రియారహిత రూపంలో విటమిన్ డి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి తగులుతుందో అప్పుడు డి విటమిన్ యాక్టివ్ అవుతుంది. అందుకే ప్రతి రోజు ఉదయం పూట కనీసం గంట సేపు ఎండ తగిలేలా చూసుకోవాలి.
బలహీనం కావడం వెనుక..
నివారణ ఇలా..
క్యాల్షియం ఉండే పదార్థాలు
పాలకూర, కరివేపాకు, క్యారెట్, నువ్వులు, గడ్లు, సోయాబీన్స్, బాదం, బ్రకోలీ, పాలు, పెరుగు, క్యాబేజీ, నారింజ, చిరు ధాన్యాలు.
విటమిన్ డి ఉండే పదార్థాలు
చేపలు, చేప నూనెలు, గుడ్డు పచ్చసొన, చీజ్, కాలేయం, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, సూక్ష్మ పోషకాలు కలిసిన నూనెలు, చిరుధాన్యాలు, నువ్వులు.