Anemia | రక్తహీనత సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంది. స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు, చిన్నారులు ఈ సమస్య బారిన పడుతుంటారు. రక్తం తక్కువగా ఉండడాన్నే రక్తహీనత అంటారన్న విషయం విదితమే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఐరన్ లోపం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఐరన్ లోపిస్తే శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను తయారు చేయలేదు. దీంతో రక్తం వృద్ధి చెందదు. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. అయితే రక్తహీనత పెద్ద సమస్య కాదు. ఇందుకు డాక్టర్లు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అలాగే పలు రకాల ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్తం తయారై రక్తహీనత తగ్గుతుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారు ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు లోహసవం, పునర్నవాది మండూరం, హరీతకీ చూర్ణం, కుమార్యాసవం వంటి మందులను వాడుకోవచ్చు. అలాగే పలు చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రక్తహీనత ఉంటే గోధుమలు, శాలి ధాన్యం, కందిపప్పు, మజ్జిగ, పాలు వంటి ఆహారాలను తీసుకుంటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, వాము 50 గ్రాములు, కందిపప్పు 100 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు కలిపి వేయించి పొడి చేయాలి. దీన్ని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తింటుండాలి. దీంతో మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల ఐరన్ లభించి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, ఆకుపత్రి, రేగు గింజల పప్పు కలిపి మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల కూడా రక్తహీనతను తగ్గించుకోవచ్చు.
పుంటి కూర, తోట కూర, పాలకూర వంటి ఆకుకూరలను తరచూ తీసుకోవడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటి వల్ల కూడా రక్తం పెరుగుతుంది. అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పటికబెల్లం పొడి కలిపిన పాలు తాగుతుండాలి. దీని వల్ల కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. రక్తం పెరిగేందుకు ఇది కూడా సహాయం చేస్తుంది. రోజూ ఒక కప్పు పెరుగులో కొద్దిగా పసుపు కలిపి తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లు, దానిమ్మ, క్యారెట్లు, బీట్ రూట్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. నల్ల శనగలను రోజూ తింటున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పొట్టుతో సహా తినాల్సి ఉంటుంది. ఇవి కూడా ఐరన్‌ను అందిస్తాయి. రక్తం పెరిగేలా చేస్తాయి.
ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలు కూడా రక్తహీనతను తగ్గించేందుకు పనిచేస్తాయి. అలాగే గుమ్మడి విత్తనాలు, నువ్వులు, జీడిపప్పు, పిస్తాను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి తింటే ఫలితం ఉంటుంది. అలాగే బ్రోకలీ, పచ్చి బఠానీలు, పొట్టుతో ఉన్న ఆలుగడ్డలు, కిస్మిస్లు, యాప్రికాట్స్, అంజీర్ పండ్లను తింటున్నా కూడా రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుతాయి. కోడిగుడ్లు, బెల్లం వంటి ఆహారాలను తింటున్నా కూడా రక్తహీనత తగ్గుతుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తింటుంటే రక్తహీనత సులభంగా తగ్గిపోతుంది. అలాగే నీరసం, అలసట తగ్గి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.