Brain Health | ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆఫీసులో పని ఒత్తిడితోపాటు కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు. దీని ప్రభావం మెదడుపై కూడా పడుతోంది. దీంతో డిప్రెషన్ బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి చాలా మందిని కుంగదీస్తోంది. అలాగే వయస్సు మీద పడడం వల్ల చాలా మందికి అల్జీమర్స్ వస్తోంది. తీవ్రమైన మతిమరుపు బారిన కూడా పడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపిస్తున్నాయి. అయితే రోజువారి దినచర్యలో పలు మార్పులు చేసుకుంటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు గాను ఉదయం కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తే మెదడును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. దీంతో చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు.
చాలా మంది రోజూ ఆలస్యంగా నిద్రించి ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల మెదడును నెగెటివ్ ప్రభావం పడుతుంది. బద్దకం ఆవహిస్తుంది. చురుగ్గా ఉండలేరు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా లోపిస్తాయి. కనుక రాత్రి పూట త్వరగా నిద్రించాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి. దీంతో యాక్టివ్గా ఉంటారు. మెదడు కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. రోజూ ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో జీవగడియారం సరిగ్గా పనిచేస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్గా ఉంటారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నిరంతరం పనిచేసినా అలసిపోరు. యాక్టివ్గానే ఉంటారు.
రోజూ కొందరు సాయంత్రం వ్యాయామం చేస్తారు. అలా కాకుండా ఉదయమే వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం మనం ఖాళీ కడుపుతో ఉంటాం. ఆ సమయంలో చేసే వ్యాయామం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మెదడును యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఉదయం భారీ వ్యాయామాలు చేయాల్సిన పనిలేదు. తేలికపాటి వాకింగ్ చేసినా చాలు, ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంతో మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలాగే రోజూ ఉదయం మీరు ఆ రోజు చేయాల్సిన పనులను రాసి పెట్టుకోండి. దీని వల్ల కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
రోజూ ఉదయం వార్తా పత్రికలు లేదా ఇతర ఏవైనా పత్రికలు, మ్యాగజైన్స్, బుక్స్ లాంటి వాటిని కనీసం 10 నిమిషాలు చదవాలి. దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది. యాక్టివ్గా ఉంటుంది. రోజంతా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఉదయం కనీసం 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. ఇది మిమ్మల్ని శారీరకంగానే కాక మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్గా ఉంటారు. అలాగే ఉదయం నూనె పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఇవి మెదడును నిస్తేజంగా మారుస్తాయి. ఆరోగ్యవంతమైన బ్రేక్ఫాస్ట్ చేయాలి. దీంతో మెదడు యాక్టివ్గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. ఇలా పలు రకాల సూచనలు పాటిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.