Natural Tips For Eye Sight | వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే కంటి చూపు మందగిస్తుంది. అయితే పోషకాహార లోపం, పలు ఇతర సమస్యల కారణంగా కూడా కంటి చూపు కొందరికి సరిగ్గా ఉండదు. ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది జంక్ ఫుడ్‌కు అలవాటు పడి పోషకాహారాన్ని తీసుకోవడం లేదు. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడి కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. కంటి చూపు మందగిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే కంటి అద్దాలను వాడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కంటి చూపును సరిగ్గా ఉంచుకోవడం అందరికీ ఆవశ్యకం అయింది. అయితే ఇప్పుడు చెప్పబోయే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు, దాంతో కంటి చూపు పెరుగుతుంది. కళ్లద్దాలను తీసి పడేస్తారు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత తరుణంలో చాలా మంది కంప్యూటర్ ఎదురుగా కూర్చునే ఉద్యోగాలనే చేస్తున్నారు. కంటి చూపు మసకబారడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఉద్యోగాలు చేసే వారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. దీన్నే 20-20-20 టెక్నిక్ అంటారు. ఈ చిట్కాను పాటించడం వల్ల కళ్లపై డిజిటల్ తెర ఎఫెక్ట్ తగ్గుతుంది. దీంతో కంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది.
కంటి చూపు మెరుగు పడాలంటే దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువులను అదే పనిగా మార్చి చూస్తూ ఉండాలి. దీంతో కంటి చూపులో పదును పెరుగుతుంది. కంటి చూపు మరింత స్పష్టంగా ఉంటుంది. డిజిటల్ తెరల ప్రభావం కళ్లపై పడదు. అలాగే కళ్లను వేగంగా ఆర్పుతూ తెరుస్తూ ఉండాలి. ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల కళ్లకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
విటమిన్ ఎ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. ముఖ్యంగా క్యారెట్లు, పాలకూర, వాల్ నట్స్ వంటి ఆహారాలను తరచూ తీసుకోవాలి. వీటిల్లో విటమిన్ ఎ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరచడంతోపాటు కంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది తగినంతగా నిద్ర కూడా పోవడం లేదు. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించడం వల్ల కూడా కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. కనీసం 6 నుంచి 8 గంటలపాటు అయినా సరే నిద్రించాల్సి ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.
బయట ఎండలో అధికంగా తిరిగే వారి కంటి చూపు త్వరగా మందగిస్తుంది. అలాంటి వారు కళ్లకు రక్షణగా అద్దాలను ధరించాలి. కళ్ల మీద ఎండ నేరుగా పడకుండా చూసుకోవాలి. దీని వల్ల కళ్లను రక్షించుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోజూ తగినంత నీటిని తాగడం వల్ల కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కొందరు నీళ్లను సరిగ్గా తాగరు. దీని వల్ల కళ్లు పొడి బారిపోతాయి. కళ్లు ఎర్రగా మారి దురదలు వస్తాయి. కంటి చూపు కూడా మసకగా మారుతుంది. కనుక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను తాగితే కళ్లు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు.