Dark Spots | ముఖంపై డార్క్ స్పాట్స్ అనేవి తరచూ ఏర్పడుతూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా పిలుస్తారు. సూర్య కాంతిలో ఎక్కువగా తిరగడం, మొటిమలు ఏర్పడడం, హార్మోన్ సమస్యలు, వాపులు రావడం వంటి కారణాల వల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలను చేయించుకోవాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు పలు చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొద్దిగా నిమ్మరసం తీసుకుని రాత్రి పూట డార్క్ స్పాట్స్‌పై లేదా ముఖంపై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే డార్క్ స్పాట్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం అందంగా మారి మెరుస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.
కలబంద గుజ్జు కూడా డార్క్ స్పాట్స్‌ను తగ్గించగలదు. ఇందులో అలోయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్‌ను తగ్గించేందుకు దోహద పడుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది. రాత్రి పూట కొద్దిగా కలబంద గుజ్జును డార్క్ స్పాట్స్‌పై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజులకు డార్క్ స్పాట్స్ మాయమవుతాయి. ముఖం సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. స్కిన్ టోన్‌ను మెరుగు పరుస్తుంది. ఒక టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ తేనె లేదా పాలు లేదా పెరుగులో ఏదో ఒక దాన్ని తీసుకుని బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే డార్క్ స్పాట్స్‌ను సులభంగా తగ్గించుకోవచ్చు.
తేనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే నల్లని మచ్చలను తగ్గిస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తేనెను నేరుగా ముఖంపై లేదా నల్లని మచ్చలపై అప్లై చేయవచ్చు. 30 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. తేనెలో కాస్త నిమ్మరసం లేదా పెరుగు కలిపి కూడా రాయవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత చర్మ కణాలను తొలగించి ముఖానికి సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. పెరుగును నేరుగా డార్క్ స్పాట్స్‌పై రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా నల్లని మచ్చలు తొలగిపోతాయి. శనగ పిండిని మనం అనేక చిరు తిళ్లను తయారు చేసేందుకు వాడుతుంటాం. కానీ ఇది చర్మానికి సంరక్షణను ఇస్తుంది. శనగపిండిని వాడడం వల్ల వదులుగా ఉన్న చర్మం టైట్‌గా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. అందులో కాస్త పసుపు కూడా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసి పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.
ఆలుగడ్డల్లో ఉండే అనేక రకాల ఎంజైమ్స్ డార్క్ స్పాట్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. ఆలుగడ్డల నుంచి జ్యూస్‌ను తీసి డార్క్ స్పాట్స్‌పై రాయాలి. 20 నిమిషాలు అయ్యాక నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది. బొప్పాయి పండ్లలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మాన్ని సంరక్షిస్తుంది. డార్క్ స్పాట్స్‌ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును కాస్త తీసుకుని ముఖానికి నేరుగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. దీని వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. గంధం పొడిలో కాస్త రోజ్ వాటర్ లేదా పాలను కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాయాలి. ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా డార్క్ స్పాట్స్‌ను తగ్గించుకోవచ్చు.