Air Pollution | ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రస్తుతం గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు గాలి కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఈ కాలుష్యం పెరిగిపోతోంది. దీని బారిన పడి అనేక మందికి వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ప్రజలకు కాలుష్యంలో తిరగడం తప్పడం లేదు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే పలు ఆయర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. దీంతో శ్వాసకోశ వ్యవస్థ సైతం శుభ్రంగా మారుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గాలి కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకు గాను కొన్ని వేపాకులను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. అలాగే రోజూ ఉదయం పరగడుపున 3 లేదా 4 వేపాకులను తింటుండాలి. ఇలా చేయడం వల్ల కాలుష్యం బారి నుంచి చర్మం, శిరోజాలను, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. రోగాలు తగ్గుతాయి. గాలి కాలుష్యాన్ని తప్పిండంలో తులసి ఆకులు కూడా మనకు మేలు చేస్తాయి. రోజూ 10 నుంచి 15 ఎంఎల్ మోతాదులో తులసి ఆకుల రసాన్ని సేవిస్తుండాలి. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది.
గాలి కాలుష్యం నుంచి బయట పడేలా చేసేందుకు గాను పసుపు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇందుకు గాను అర టీస్పూన్ పసుపును, ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా నెయ్యితో కలిపి రోజూ ఉదయం పరగడుపునే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేయడం వల్ల కాలుష్యం బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఈ సమస్యకు నెయ్యి కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. రోజూ రాత్రి పూట నిద్రకు ముందు రెండు ముక్కు రంధ్రాల్లోనూ రెండేసి చొప్పున నెయ్యి చుక్కలను మరిగించి వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ముక్కు రంధ్రాలు శుభ్రమవుతాయి. కాలుష్య కారకాలు తొలగిపోతాయి. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊపిరితిత్తులను శుభ్రం చేసి కాలుష్యం బారి నుంచి మనల్ని రక్షించడంలో పిప్పళ్లు కూడా అమోఘంగానే పనిచేస్తాయి. ఇవి మనకు ఆయుర్వేద మందుల దుకాణాల్లో లభిస్తాయి. పిప్పళ్లను వాడడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. పావు టీస్పూన్ అల్లం రసం, పావు టీస్పూన్ పసుపు, 1/8 వ వంతు పిప్పళ్ల చూర్ణం, ఒక టేబుల్ స్పూన్ తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి వరుసగా 7 రోజుల పాటు నిత్యం తీసుకోవాలి. ఇలా చేస్తుండడం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలుష్యం బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే త్రిఫల చూర్ణం కూడా ఇందుకు మనకు పనిచేస్తుంది. నిత్యం రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం, ఒక టీస్పూన్ తేనెలను బాగా కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ ఒక దానిమ్మ పండును తింటున్నా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకోవడం వల్ల గాలి కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.