Ayurvedic Remedies For Kidney Stones | మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు వీపు కింది భాగంలో వెనుక వైపు ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం చిక్కుడు గింజల మాదిరిగా కాస్త పెద్ద సైజులో ఉంటాయి. కిడ్నీలు మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందువల్ల కిడ్నీలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. అయితే కిడ్నీల పనితీరుకు ఆటంకం ఏర్పడితే కిడ్నీ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది పాటించే జీవనశైలి లేదా తినే ఆహారం, తాగే ద్రవాల వల్ల వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు ఆ స్టోన్లను వదిలించుకునే మార్గం చూడాలి.
కిడ్నీ స్టోన్లు వచ్చాయంటే పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొందరికి జ్వరం రావచ్చు. అలాగే వికారంగా వాంతికి వచ్చినట్లు ఉంటుంది. మరీ ఎక్కువ సైజు స్టోన్లు ఉంటే వాంతులు కూడా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల కిడ్నీ స్టోన్లను కరిగిపోయేలా చేయాల్సి ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవడంతోపాటు కింద తెలిపిన విధంగా పలు ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో స్టోన్లను చాలా సులభంగా కరిగించుకోవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు కరిగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ స్టోన్లను కరిగించడంలో త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుందన్నమాట. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. త్రిఫల చూర్ణం మూడు ఫలాల కలయిక అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను ఎండ బెట్టి మూడింటినీ పొడి చేసి సమాన భాగాల్లో కలిపి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. అందువల్ల త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ఈ చూర్ణాన్ని రాత్రిపూట ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. దీని వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడడంతోపాటు స్టోన్స్ కరిగిపోతాయి.
అయితే త్రిఫల చూర్ణం కొందరికి పడకపోవచ్చు. దీన్ని తీసుకున్న వెంటనే కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి వారు ఈ చూర్ణాన్ని ఉపయోగించడం వెంటనే మానేయాలి. ఇక గోఖ్రు అనే మూలిక కూడా కిడ్నీ స్టోన్లను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సహజసిద్ధమైన డై యురెటిక్గా పనిచేస్తుంది. అందువల్ల కిడ్నీల్లో ఉండే స్టోన్లతోపాటు చెత్త, వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. గోఖ్రు పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇక ఈ పొడిని తీసుకుంటే క్రియాటినైన్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.
గుర్మార్ అనే మూలిక కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలోని చెత్తను బయటకు పంపుతుంది. కిడ్నీలలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీన్ని రోజూ తీసకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ఇలా పలు ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల కిడ్నీ స్టోన్లను కరిగించుకోవచ్చు. అయితే ఈ మూలికలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. అన్ని మూలికలు, పొడులు అందరికీ పడకపోవచ్చు. కనుక ఎవరికి తగినట్లు వారికి వైద్యులు ప్రత్యేకంగా ఔషధాలను అందిస్తారు. వాటిని వాడితే కిడ్నీ స్టోన్లను సులభంగా కరిగించుకోవచ్చు.