DASH Diet For High BP | ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌ను కచ్చితంగా పాటించాలి. మనం పాటించే డైట్ వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే హైబీపీని తగ్గించుకునేందుకు కూడా డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. హైబీపీ అనేది ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా వస్తోంది. అలాంటి వారు డాష్ డైట్‌ను పాటిస్తే ఫలితం ఉంటుంది. దీన్నే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ (DASH) అని కూడా అంటారు. ఈ డైట్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. హైబీపీ తగ్గాలంటే ఈ డైట్‌ను పాటించాలని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. ఇక ఈ డైట్‌ను ఏమిటో, ఇందులో భాగంగా ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డాష్ డైట్ అనేది ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలనే నియమాన్ని సూచిస్తుంది. ఈ డైట్‌ను పాటించే వారు అలాంటి ఆహారాలను అసలు తీసుకోకూడదు. అందుకు బదులుగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను తినాలని ఈ డైట్ సూచిస్తుంది. ఇందులో భాగంగా చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి. అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవడం మానేయాలి. అప్పుడు డాష్ డైట్ పాటించినట్లు అవుతుంది.
ఈ డైట్లో భాగంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఇవి బీపీని తగ్గిస్తాయి. అన్ని విధాలుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తృణ ధాన్యాలను తినడం కూడా డాష్ డైట్లో ఒక భాగం. తృణ ధాన్యాలను రోజువారి ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమలతో చేసిన బ్రెడ్‌ను తినాల్సి ఉంటుంది. ఈ ఆహారాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
డాష్ డైట్లో భాగంగా లీన్ ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చికెన్, చేపలు, బీన్స్, నట్స్ అన్నమాట. అదేవిధంగా మటన్ తినడం తగ్గించాలి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోరాదు. దీంతోపాటు గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహారాలను తినాలి. ఇక డాష్ డైట్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. సోడియంను దాదాపుగా చాలా వరకు తగ్గించాలి. సోడియం తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గిస్తే బీపీ తగ్గుతుంది. దీంతో హైబీపీ నియంత్రణలో ఉంటుంది. ఇలా డాష్ డైట్‌ను పాటించడం వల్ల హైబీపీని ఎవరైనా సరే సులభంగా కంట్రోల్ చేయవచ్చు.
ఇక హైబీపీ కంట్రోల్ అవ్వాలంటే బరువును నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. బీపీ, షుగర్ రెండూ ఉన్నవారు షుగర్‌ను కూడా కంట్రోల్ చేయాలి. దీంతో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.