Flax Seeds Benefits | మనం ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం రోజూ తినే అన్నం, కూరల వల్ల పోషకాలు లభించడం కష్టమే. అన్ని రకాల పోషకాలు మనం తినే రోజువారి ఫుడ్‌తో అయితే లభించవు. అందుకని సాయంత్రం సమయంలో ఏవైనా ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. దీంతో అన్ని పోషకాలను అందుకునేందుకు వీలుంటుంది. ఇక సాయంత్రం సమయంలో చాలా మంది చిరుతిళ్లను తింటుంటారు. అలా కాకుండా ఆరోగ్యవంతమైన ఆహారాలను తినాలి. దీంతో పోషకాలు, శక్తి రెండూ పొందవచ్చు. సాయంత్రం తినదగిన ఆహారాల్లో అవిసె గింజలు కూడా ఒకటి.
అవిసె గింజల గురించి గతంలో చాలా మందికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు దాదాపుగా అందరికీ వీటి గురించి తెలుసు. ఈ గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. చేపలకు దాదాపుగా సమానమైన పోషకాలు ఈ గింజల్లో ఉంటాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. కనుక అవిసె గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని నేరుగా తినలేమని అనుకునేవారు కాస్త వేయించి తినవచ్చు. అవిసె గింజలను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఈ గింజలను పోషకాలకు గని అని చెప్పవచ్చు.
అవిసె గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీని వల్ల గుండె పోటు రాదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజల్లో రెండు రకాల ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ అని రెండు రకాల ఫైబర్లు ఈ గింజల్లో ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. రోజూ సుఖ విరేచనం అయ్యేలా చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారు రోజూ అవిసె గింజలను తింటే మేలు జరుగుతుంది. ఈ గింజల్లో లిగ్నన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయన్నమాట. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.
అవిసె గింజల్లో సహజసిద్ధమైన ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. అందువల్ల స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఏఎల్ఏ అనే పోషకాలు ఉంటాయి. అందువల్ల చర్మం తేమగా ఉంటుంది. పొడి చర్మం నుంచి విముక్తి లభిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. ఇలా అవిసె గింజలతో అనేక లాభాలను పొందవచ్చు కనుక రోజువారి ఆహారంలో వీటిని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.