న్యూఢిల్లీ : చలికాలంలో పలురకాల వైరస్లు, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చలి వాతావరణం నుంచి శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు సీజనల్ ఇన్ఫెక్షన్స్కు చెక్ పెట్టేందుకు ప్రొటీన్లు, ఫైబర్, పోషకాలతో కూడిన ఆహారం కీలకం.
చర్మ సంరక్షణ, జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చూసుకునేందుకు అనువైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఐదు ఆహార పదార్ధాలను ఈ సీజన్లో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఫిట్నెస్, పోషకాహార నిపుణులు రోహిత్ సెలత్కర్ చెబుతున్నారు. శరీరంలో కణజాలాన్ని రిపేర్ చేసే ఆరోగ్యకర కొవ్వులు పుష్కలంగా ఉండే కోడిగుడ్డును ప్రతిరోజూ తీసుకోవాలి. ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఎగ్ తినడం ద్వారా కడుపు నిండిన భావన రావడంతో అధిక క్యాలరీలను తీసుకునే ఇబ్బంది తప్పుతుంది.
ఇక తక్షణ శక్తినిచ్చే వేరుశనగ గింజల్లో ఎన్నో పోషకాలు నిండిఉంటాయి. వీటితో పాటు స్వీట్ పొటాటో, బాదం, వాల్నట్స్ వంటి నట్స్, రాగి, జొన్న, బొబ్బర్లు వంటి మిల్లెట్స్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, ఫైబర్ తగినంతగా అందుతాయి. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇవి మధుమేహం, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.