ఒక చేప.. ఐదు లాభాలు!
చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర అత్యవసర పోషకాలు క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి
చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర అత్యవసర పోషకాలు క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి. వీటిలోని ప్రొటీన్లు కండరాలకు బలాన్నిస్తాయి. ఇంకా మరెన్నో ప్రయోజనాలు…
విటమిన్లు, మినరల్స్
చేపల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే డాక్టర్లు చేపలు తినమని సూచిస్తారు. వీటిలోని నాణ్యమైన ప్రొటీన్లు, కొవ్వులు శరీరానికి మంచిచేస్తాయి. విటమిన్-డి కూడా పుష్కలమే.
ఆరోగ్యకరమైన కొవ్వులు
సాల్మన్, మాకెరెల్, సార్డిన్లు లాంటి చేపల్లో ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికం. మెదడు, కండ్లకు ఫ్యాటీ ఆమ్లాలు అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఏదో ఒక రూపంలో ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరం వీటిని సొంతంగా తయారు చేసుకోలేదు. చేపల ద్వారానే శరీరానికి లభిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తగిన మోతాదులో అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.
మెదడుకు మేత
తరచూ చేపలు తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది చివరికి అల్జీమర్స్ లాంటి మతిమరుపు వ్యాధులకు దారితీస్తుంది. చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువనీ, మెదడు సంబంధ వ్యాధులు నామమాత్రమనీ అధ్యయనాల్లో తేలింది. వారానికి ఒక్కసారైనా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం ‘గ్రేమ్యాటర్’ చైతన్యంగా ఉంటుందని నిపుణులు చెబుతారు.

బరువు తగ్గడంలో..
చేపల్లో ప్రొటీన్ల మోతాదు ఎక్కువ. ప్రొటీన్లు తీసుకుంటే బరువు తగ్గుతారు. చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జీవక్రియ మీద సానుకూలమైన ప్రభావం చూపుతాయి. అయితే చేపల్లో కొవ్వు కూడా ఉంటుంది కాబట్టి, కెలోరీలు కూడా కించిత్ ఎక్కువేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నూనెలో వేయించిన, మసాలాలో ముంచి తేల్చిన చేపల కూరలకు దూరంగా ఉంటే మంచిది.
కంటిచూపుతో..
చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఒక అధ్యయనం ప్రకారం ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల మెదడు, కండ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసుతోపాటు తలెత్తే దృష్టిదోషాన్ని కూడా చేపలు తినడం ద్వారా అడ్డుకోవచ్చు. చేపలు తినని వారితో పోలిస్తే తినేవారిలో రెటీనా పనితీరును దెబ్బతీసే.. ఏఎమ్డీ ముప్పు 43 శాతం తక్కువని పరిశోధనల్లో తేలింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

