భారతీయుల వంటల్లో మెంతులు తరచుగా వాడుతూనే ఉంటారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం మెంతుల్లో ఉండే విటమిన్లు, మినరల్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెంతుల నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
ఒకటిన్నర టీ స్పూన్ల మెంతులను ఓ గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున ఈ నీళ్లను వడగట్టి పరగడుపునే తాగేయాలి.