తినే పదార్థాల ఉత్పత్తుల మీది లేబుళ్లను అందరూ చదువుతారు. గడువు తేదీ ముగిసినా.. దగ్గరపడినా కొనుగోలు చేయరు. అయితే, ఈ ఎక్స్పైరీ డేట్ అనేది కేవలం తినే ఉత్పత్తుల మీదే కాదు.. మన శరీర అవసరాల కోసం వాడుకునే ప్రతిదానికీ వర్తిస్తుంది. సబ్బులు, షాంపూలూ.. దీనికి మినహాయింపు కాదు.