Wooden Utensils | చెక్క స్పూన్లు, స్పాటులాలను ఇలా శుభ్రం చేయాలి.. ఈజీ ట్రిక్..
వంటగదిలో చెక్కతో తయారైన గరిటెలు, చెంచాలు, స్పాటులాలు తరచూగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే నూనె, తేమ, ఆహార పదార్థాల వాసనలు చెక్కలోకి ఇంకిపోతాయి. దీంతో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ తేమకు గురై ఆ తర్వాత ఎండిపోవడం వల్ల చెక్క వాపులకు గురి కావడం, వంకరగా మారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాలక్రమేణా చెక్కలోని చిన్న రేణువులు విడిపోయి ఆహారంలో కలిసే ప్రమాదం కూడా ఉంటుంది.
Wooden Utensils | వంటగదిలో చెక్కతో తయారైన గరిటెలు, చెంచాలు, స్పాటులాలు తరచూగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే నూనె, తేమ, ఆహార పదార్థాల వాసనలు చెక్కలోకి ఇంకిపోతాయి. దీంతో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ తేమకు గురై ఆ తర్వాత ఎండిపోవడం వల్ల చెక్క వాపులకు గురి కావడం, వంకరగా మారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాలక్రమేణా చెక్కలోని చిన్న రేణువులు విడిపోయి ఆహారంలో కలిసే ప్రమాదం కూడా ఉంటుంది.
ఏం చేయాలి..
చెక్క గరిటెలు, చెంచాలు, స్పాటులాలను శుభ్రం చేసేందుకు ఒక సులభమైన పద్ధతిని నిపుణులు వివరించారు. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వెనిగర్ వేసి మరిగించాలి. అందులో చెక్క సామగ్రిని వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకుపోయిన మురికి, నూనె, ఆహార అవశేషాలను తొలగించేందుకు సహాయపడుతుంది.
మరిగించిన తర్వాత చెక్క సామగ్రిని శుభ్రమైన నీటితో బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. చెక్కలో తేమ మిగిలి ఉండకుండా పూర్తిగా పొడిగా మారిన తర్వాత మాత్రమే తదుపరి ప్రక్రియ చేయాలి. ఆ తర్వాత చెక్క గరిటెలు, చెంచాలు, స్పాటులాలపై పలుచని పొరగా ఆవ నూనెను రాయాలి. ఇది చెక్క పొడిబారకుండా ఉంచడంలో, దాని నాణ్యతను కొంతకాలం కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
చెక్క వంట సామగ్రిని ఇలా క్రమం తప్పకుండా శుభ్రం చేసి, సరిగ్గా ఆరబెట్టి, సంరక్షించడం ద్వారా వాటిని ఎక్కువకాలం మంచి స్థితిలో ఉంచుకోవచ్చు. వంటగదిలో ఉపయోగించే చెక్క వస్తువులు తేమను ఎక్కువగా పీల్చుకోకుండా చూసుకోవడం, శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడం కూడా ముఖ్యమే. సరైన సంరక్షణతో చెక్క గరిటెలు, చెంచాలు, స్పాటులాలను పరిశుభ్రంగా, ఉపయోగించడానికి అనుకూలంగా ఎక్కువకాలం ఉంచుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

