Weight Loss : వ్యాయామానికి ముందు మీరు ఏం తీసుకున్నారనేది మీ వర్కవుట్ సామర్ధ్యం సహా పలు అంశాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయరాదని, ఫిట్నెస్ లక్ష్యాలను అందుకోవాలంటే వర్కవుట్స్ ముందు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం శరీరానికి ఉత్తేజం ఇవ్వడంతో పాటు వ్యాయామ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.
కండరాలు దెబ్బతినే ముప్పును కూడా ఇది నివారిస్తుంది. ప్రీ వర్కవుట్ స్నాక్స్‌లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల మధ్య సమతూకం పాటించాలి. వీటి మధ్య సరైన బ్యాలెన్స్ పాటిస్తే శరీరానికి శక్తి సమకూరడంతో పాటు కండరాలు వృద్ధి చెందుతాయి.
ప్రీ వర్కవుట్ స్నాక్స్ కోసం పీనట్ బటర్‌తో యాపిల్, దానిమ్మ ఇతర సీడ్స్‌తో కూడిన పెరుగు, సబ్జా గింజలతో కొబ్బరి నీళ్లు, బాయిల్డ్ ఎగ్స్, బ్లాక్ కాఫీ వంటివి తీసుకోవచ్చు. ఇక వ్యాయామానికి ముందు షుగర్, షుగర్ అధికంగా ఉన్న ఫుడ్స్, నూనె పదార్ధాలు, ప్రొటీన్ షేక్స్ (వీటిని వర్కువట్స్ అనంతరం తీసుకోవచ్చు), డైరీ డ్రింక్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Read More :
TS Weather | తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. మరో ఐదురోజులు ఇదే పరిస్థితి..!