Heart Failure Symptoms | ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో చాలా మందికి హార్ట్ ఎటాక్ వస్తుంటుంది. రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే రక్త సరఫరాకు ఆటంకం కలిగి అప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతోంది. దీంతో ఉన్న చోటనే కుప్పకూలి పడిపోతున్నారు. వెంటనే ప్రాణాలను విడుస్తున్నారు. హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించే సమయం కూడా ఉండడం లేదు. ఈ క్రమంలోనే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రస్తుతం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. రక్త నాళాల ద్వారా రక్తాన్ని గుండె సరిగ్గా పంప్ చేయలేకపోతే అప్పుడు గుండె కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీంతో గుండె కండరాలు బలహీనంగా మారుతాయి. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. దీని వల్ల మనిషి ఉన్న చోటనే కుప్పకూలి ఆకస్మికంగా చనిపోతాడు. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు మన శరీరం మనకు పలు లక్షణాలు, సంకేతాలను తెలియజేస్తుంది.
హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. తరచూ ఈ సమస్య బారిన పడుతుంటారు. ఈ లక్షణం గనక ఉందంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ అవకుండా ముందుగానే ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఇక హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు తరచూ దగ్గు వస్తుంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు అధికంగా చేరడం వల్ల ఇలా జరుగుతుంది. దగ్గినప్పుడు కొందరికి రక్తం కూడా పడుతుంది. ఇలాంటి లక్షణం ఉన్నా వెంటనే జాగ్రత్త పడాలి. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. తరచూ ఈ సమస్యలు వస్తుంటాయి. చిన్న పనిచేసినా అలసి పోతుంటారు. బాగా నీరసంగా అనిపిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. గుండె కండరాలపై ఒత్తిడి కూడా పడుతుంది. అందుకనే నీరసం, అలసట విపరీతంగా ఉంటాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు కొందరికి కాలి మడమల్లో వాపులు కనిపిస్తాయి. శరీరంలో ద్రవాలు అధికంగా చేరడం వల్ల ఇలా జరుగుతుంది. కిడ్నీలపై భారం పడి కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోయినా ద్రవాలు ఇలా అధికంగా చేరతాయి. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందు కూడా ఇలా జరుగుతుంది. కనుక ఈ విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందు కొందరు అకస్మాత్తుగా ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరుగుతారు. అలాగే ఎల్లప్పుడూ గుండె దడగా ఉంటుంది. గుండె అసాధారణ రీతితో కొట్టుకుంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందు కొందరికి జీర్ణాశయం, పేగుల్లో ద్రవాలు ఎక్కువగా చేరతాయి. ఈ కారణంగా కొందరికి జీర్ణాశయం కుచించుకుపోతుంది. దీంతో పొట్ట ఎల్లప్పుడూ నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాస్త భోజనం చేసినా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఆకలి కూడా ఉండదు. ఇక హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేందుకు ముందు కొందరికి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్లుండి సడెన్‌గా తీవ్రంగా శుష్కించిపోతారు. ఇలా హార్ట్ ఫెయిల్యూర్‌కు ముందు పలు లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం ద్వారా ముందుగానే చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.