Vegetable Juices | మనం రోజువారి ఆహారంలో భాగంగా అనేక రకాల కూరగాయలను లేదా ఆకుకూరలను కూరలుగా చేసుకుని తింటుంటాం. ఇందులో భాగంగానే అనేక రకాల కూరగాయలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమకు నచ్చిన లేదా అందుబాటులో ఉన్న కూరగాయలు లేదా ఆకుకూరలనే తరచూ తింటుంటారు. అయితే కూరగాయలను పచ్చిగా కూడా తినవచ్చు. కూరగా చేసి తినడం కన్నా కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తింటేనే మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కూరగాయలను నేరుగా అలా పచ్చిగానే తినేకంటే వాటిని జ్యూస్‌లా తయారుచేసి తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలను పచ్చిగా తినడం కొందరికి కష్టమవుతుంది. అలాంటి వారు వాటితో జ్యూస్ తయారు చేస్తే చాలా సులభంగా తాగవచ్చు. ఇక ఒక్కో రకమైన కూరగాయల జ్యూస్‌ను తాగడం వల్ల మనకు భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మనకు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలను నేరుగా అలాగే పచ్చిగా తినవచ్చు. కానీ జ్యూస్ చేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ చాలా సులభంగా తాగవచ్చు. టమాటా జ్యూస్‌ను రోజూ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఐరన్ లభిస్తుంది. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. టమాటాల్లో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ జ్యూస్ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. అధిక బరువు సులభంగా తగ్గవచ్చు. జీర్ణ సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.
పాలకూర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. హైబీపీ ఉన్నవారు ఈ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది. దీని వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలకు బలం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రక్తహీనత తగ్గుతుంది. అలాగే రోజూ క్యాబేజీ జ్యూస్‌ను కూడా సేవించవచ్చు. దీని వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె పోటు, క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. అధిక బరువు సులభంగా తగ్గుతారు. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
చిలగడ దుంపలను రోజూ నేరుగా తినవచ్చు. జ్యూస్‌గా తయారు చేసి కూడా తాగవచ్చు. ఈ జ్యూస్‌ను తాగితే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అల్సర్లు ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే రోజూ కొత్తిమీర జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇది రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చేస్తుంది. గుండె సురక్షితంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే బీట్ రూట్ జ్యూస్‌ను కూడా రోజూ సేవిస్తుండవచ్చు. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్, కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇలా ఆయా రకాల కూరగాయల జ్యూస్‌లను రోజూ తాగుతుంటే భిన్న రకాల లాభాలను పొందవచ్చు. అయితే రోజూ ఏదైనా ఒక జ్యూస్‌ను మాత్రమే తాగాలి. ఉదయం పరగడుపున తాగితే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఒక కప్పు మోతాదులో ఏ జ్యూస్‌ను అయినా సరే తాగవచ్చు.