Coconut Water | కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ నీళ్లను తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మనల్ని రోగాల నుంచి రక్షించడంలో కొబ్బరినీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. అయితే చాలా మంది కేవలం వేసవిలో మాత్రమే కొబ్బరినీళ్లను తాగుతుంటారు. వేసవిలో కొబ్బరినీళ్లను తాగడం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. అయితే కేవలం వేసవిలోనే కాదు కొబ్బరి నీళ్లను వాస్తవానికి ఏ సీజన్లో అయినా సరే తాగవచ్చు. ముఖ్యంగా ఈ నీళ్లను చలికాలంలో తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరినీళ్లను సీజన్లతో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా సరే తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో శరీరాన్ని హైడ్రేటింగ్ చేసే గుణాలు ఉంటాయి. ఈ నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. కనుక కొబ్బరి నీళ్లను అన్ని సీజన్లలోనూ తాగాల్సి ఉంటుంది. చలికాలంలో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో సహజంగానే కొందరి శరీరం నుంచి నీరు అధికంగా బయటకు పోతుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. అయితే కొబ్బరి నీటిని తాగితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందుతుంది. అలాగే చర్మానికి కావల్సిన రక్షణ లభిస్తుంది. పొడిగా ఉన్న చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. దీంతో చలికాలంలో చర్మం పగలకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే ఈ నీటిలో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరరీం కోల్పోయే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. దీని వల్ల తీవ్రమైన అలసట, నీరసం నుంచి బయట పడవచ్చు. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా పనిచేస్తారు. కొబ్బరినీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో చలికాలంలో మనకు వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చలికాలంలో మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. కానీ కొబ్బరి నీటిని తాగితే అజీర్ణం అన్న సమస్య ఉండదు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలాగే పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత కొందరికి ఈ సీజన్లో భారంగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి నీళ్లను తాగాల్సి ఉంటుంది.
కొబ్బరి నీటిలో సహజసిద్ధమైన ఎంజైమ్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. కొబ్బరినీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల కొబ్బరి నీళ్లను చలికాలంలో తాగితే చర్మం పొడిబారకుండా, పగలకుండా చూసుకోవచ్చు. చర్మంలో కూడా కాంతి పెరుగుతుంది. చర్మం ప్రకాశిస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఇలా కొబ్బరి నీటిని తాగడం వల్ల చలికాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని ఈ సీజన్లో మరిచిపోకుండా సేవించండి.