వెన్నునొప్పి: గంటల తరబడి పనిలో వెన్నెముక సమస్యలు సర్వసాధారణం. క్రమంగా ఇది స్పాండిలైటిస్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
పరిష్కారం : సరైన కుర్చీలో కూర్చుంటే వెన్నెముక సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. నడుము కటిభాగంలో సపోర్ట్ ఉండాలి. కంప్యూటర్‌పై పనిచేసే వాళ్లు టేబుల్, కుర్చీ ఎత్తులు నిర్ణీత కొలతల్లో ఉండేలా చూసుకోవాలి. పని మధ్యలో పది నిమిషాలైనా విరామం తీసుకుని, నాలుగు అడుగులు వేస్తుండాలి.
కంటి సమస్యలు: కంప్యూటర్‌పై గంటలకొద్దీ పనిచేయడం వల్ల కండ్లు పొడిబారుతుంటాయి. కండ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కంటి సమస్యలకు దారితీస్తుంది.
పరిష్కారం : కంప్యూటర్‌పై సరైన వెలుతురు పడేలా చూసుకోవాలి. మానిటర్ వెలుగు నిర్దిష్టంగా ఉండేలా సెట్ చేసుకోవాలి.
తలనొప్పి: ఉద్యోగులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య తలనొప్పి. పనిలో ఒత్తిడి, కూర్చునే విధానం, నీరు సరిగ్గా తాగకపోవడం ఇవన్నీ తలనొప్పికి కారణాలు.
పరిష్కారం: పనిలో ప్రతీ రెండు గంటలకు ఒక పది నిమిషాలు విరామం తీసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.