Nutmeg Milk | మసాలా దినుసుల వాడకం అనేది మన వంటల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు రకాల వెజ్ వంటకాలతోపాటు నాన్ వెజ్ వంటకాలను వండినప్పుడు మసాలా దినుసుల వాడకం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ పుణ్యమా అని మసాలా దినుసుల గురించి మనం చాలా ఎక్కువగా తెలుసుకుంటున్నాం. చాలా మంది తమకు తెలియని అనేక రకాల మసాలాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మసాలా దినుసుల్లో జాజికాయలు కూడా ఒకటి. ఇవి చక్కని వాసనను కలిగి ఉంటాయి. జాజికాయను పొడి చేసి అనేక వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్ని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయ మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జాజికాయలను పొడిగా చేసి రోజూ రాత్రి కాస్త మోతాదులో ఆ పొడిని తీసుకుని ఒక గ్లాస్ పాలలో వేసి కలిపి నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజూ రాత్రి జాజికాయ పొడి కలిపిన పాలను తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
జాజికాయలు మైండ్‌ను రిలాక్స్ గా ఉండేలా చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. దీంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢనిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రోజూ ఆలస్యంగా నిద్ర పోయే వారు జాజికాయ పొడి కలిపిన పాలను తాగుతుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. జాజికాయల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. దీంతో రోజంతా పనిచేసి అలసిపోయిన వారు ఉల్లాసాన్ని పొందవచ్చు. ఉత్సాహంగా మారుతారు. జాజికాయ పొడి కలిపిన పాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు. జీర్ణాశయం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను రక్షిస్తుంది.
జాజికాయల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం ఉండదు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. జాజికాయ పొడి కలిపిన పాలను తరచూ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జాజికాయల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. జాజికాయల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వాపులు కూడా తగ్గుతాయి. దీంతో కీళ్లు, మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
జాజికాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పాలలో క్యాల్షియం, మెగ్నిషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక జాజికాయ పొడిని రోజూ పాలలో కలిపి తాగితే అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.