Cinnamon Water | దాల్చిన చెక్కను ఎక్కువగా మనం మసాలా వంటకాల్లో వేస్తుంటాం. వెజ్ లేదా నాన్ వెజ్ ఏది వండినా సరే అందులో మసాలా అంటే కచ్చితంగా దాల్చిన చెక్క ఉండి తీరాల్సిందే. దీన్ని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా దాల్చిన చెక్క ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్కను వేసి మరిగించిన నీళ్లను రోజూ రాత్రి పూట తాగుతుంటే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నీళ్లు మనకు అనేక లాభాలను అందిస్తాయని వారు అంటున్నారు. దాల్చిన చెక్కను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఈ చెక్కలో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్క నీళ్లను రోజూ రాత్రి పూట నిద్రకు ముందు ఒక కప్పు మోతాదులో అయిన తాగాలని సూచిస్తున్నారు.
దాల్చిన చెక్క నీళ్లను రోజూ తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. మరోవైపు క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి సైతం పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారు దాల్చిన చెక్క నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. కడుపులో మంటగా అనిపిస్తే కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్కలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఈ చెక్కలో అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా వచ్చే వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాలు వెడల్పుగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
దాల్చిన చెక్క నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. రాత్రి పూట మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కనుక అలాంటి సమయంలో ఈ నీళ్లను తాగాలి. అప్పుడు మనం నిద్రించినా కూడా మెటబాలిజం ఎక్కువగానే ఉంటుంది కనుక మనం పడుకుని ఉన్నా కూడా క్యాలరీలు ఖర్చవుతూనే ఉంటాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క నీళ్లను సేవిస్తుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడి యాక్టివ్‌గా మారుతుంది. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.