Health tips : చలికాలంలో మన చర్మం పొడిబారినప్పుడు తేమను నిలుపుకోవడం చాలా ముఖ్యం. చాలామంది అమ్మాయిలు గ్లిజరిన్‌తో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. చర్మంపై గ్లిజరిన్, రోజ్ వాటర్ అప్లై చేయడంవల్ల తేమను నిలుపుకోగలమని చాలామంది భావిస్తున్నారు. అయితే గ్లిజరిన్, రోజ్ వాటర్‌ను ఎలా పడితే అలా వాడితే చర్మానికి హానీ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ వ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.
పెదవులకు
పొడిబారిన పెదవులపై గ్లిజరిన్ రాయడం మంచిది కాదు. అదేవిధంగా కొన్ని బ్రాండ్ల లిప్ బామ్‌లు కూడా పెదవులకు హానికరంగా ఉండొచ్చు. కాబట్టి పెదవుల తేమ కోసం ఆవు నెయ్యి రాసుకోవడం ఉత్తమం.
ముఖానికి
ముఖంపై గ్లిజరిన్ అప్లై చేయడం వల్ల మొటిమలు, ఎర్రదనం, దద్దుర్లు లాంటి సమస్యలు రావచ్చు. తేలికపాటి నాణ్యత ఉన్న గ్లిజరిన్ చర్మం మీద రియాక్షన్‌కు కారణం కావచ్చు. కాబట్టి ముఖంపై గ్లిజరిన్ వినియోగానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఎవరికి ఏ మాయిశ్చరైజర్..?
పొడి చర్మం ఉన్నవాళ్లు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అటు పొడి చర్మం, ఇటు జిడ్డు చర్మం కాకుండా సాధారణ చర్మం ఉన్నవాళ్లు రెండు రకాల మాయిశ్చరైజర్లను ఉపయోగించవచ్చని అంటున్నారు. చలికాలం ప్రారంభంలోనే మీ చర్మ రకానికి అనుగుణంగా ఉత్పత్తులను ఎంచుకోవాలని డాక్టర్ అనురాధ తాకర్ఖేడే సూచిస్తున్నారు.