Akshay Kumar Diet | సినిమా సెలబ్రిటీలు సహజంగానే ఫిట్ గా ఉండడం కోసం డైట్‌ను పాటిస్తుంటారు. అనేక రకాల ఆహారాలను తినాలని వారికి కూడా కోరిక ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లు ఫుడ్‌ను తినరు. అలా తింటే లావుగా మారిపోతారు. తెర మీద అభిమానులు చూడలేరు. కనుకనే వారు స్ట్రిక్ట్‌గా డైట్‌ను మెయింటెయిన్ చేస్తుంటారు. ఇక డైట్, ఫిట్ నెస్ విషయానికి వస్తే మనకు బాలీవుడ్ సెలబ్రిటీల్లో అక్షయ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన వయస్సు 57 ఏళ్లు అయినప్పటికీ అలా కనిపించరు. ఇంకా యంగ్‌గానే ఉన్నట్లు కనిపిస్తారు. కుర్ర హీరోలకు పోటీగా ఫైట్స్ చేస్తుంటారు. యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తుంటారు. ఆయన కచ్చితమైన డైట్‌తోపాటు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటిస్తారు. అందుకనే ఈ వయస్సులోనూ ఆయన అంత ఫిట్‌గా ఉన్నారు. ఇక ఆయన ఎలాంటి డైట్‌ను పాటిస్తారు, అన్న విషయానికి వస్తే..
అక్షయ్ కుమార్ ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆ సమయంలో నిద్ర లేస్తేనే వ్యాయామానికి కావల్సినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయం. వ్యాయామం చేయడంతోపాటు ఆ సమయంలో ఆ రోజు షెడ్యూల్‌ను కూడా ఆయన చెక్ చేసుకుంటారు. ఆ రోజు ఏమేం చేయాలో అవన్నీ పూర్తి చేసుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆయన రన్నింగ్ లేదా జాగింగ్ కచ్చితంగా చేస్తారు. ఇవి ముగించుకున్న తరువాత తేలికపాటి వ్యాయామాలు, బరువులు ఎత్తడం చేస్తారు. అక్షయ్ కుమార్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం వ్యాయామం చేసిన అనంతరం కాసేపు ఆయన మార్షల్ ఆర్ట్స్‌ను కూడా ప్రాక్టీస్ చేస్తారు. కరాటే, మువా థాయ్, టైక్వాండో వంటివి ప్రాక్టీస్ చేస్తారు.
వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ముగిసిన తరువాత కచ్చితంగా ఒక బొప్పాయి పండు తింటారు. దీంతోపాటు ఆ సీజన్లో అందుబాటులో ఉండే పండ్లను కచ్చితంగా తింటానని అక్షయ్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే శరీరానికి ఉదయమే అన్ని పోషకాలు అందేలా చూసుకుంటారు. అనేక పోషకాలు ఉండే ఆహారాలను ఆయన ఉదయమే తింటారు. అక్షయ్ కుమార్ ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని షూటింగ్లలో పాల్గొన్నా కచ్చితంగా ఇంట్లో వండిన భోజనాన్నే తింటారు. బయటి ఫుడ్‌ను అసలు ముట్టుకోరు. ఇదే విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్‌ను ఆయన ఎక్కువగా తింటారు. అలాగే కారం, నూనె, మసాలాలను తక్కువగా తింటారు. ఆకలి అయినప్పుడల్లా తింటారు. కానీ ఎంత కావాలో అంతే తింటారు. బరువును ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉండేలా చూసుకుంటారు.
ప్యాక్ చేయబడిన ఆహారాలు, ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, నూనె పదార్థాలు, స్వీట్లను అక్షయ్ అసలు ముట్టుకోరు. సహజసిద్ధమైన ఆహారాన్నే తింటారు. రోజులో అధిక మొత్తంలో ప్రోటీన్లు అందేలా చూసుకుంటారు. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తింటారు. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ట్యాబ్లెట్లను మాత్రం వాడరు. అక్షయ్ కుమార్ మద్యం సేవించరు, పొగ తాగరు, అందువల్లే ఆయన ఈ వయస్సులోనూ ఫిట్‌గా ఉన్నారు. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆయన దేశవాళీ నెయ్యిని ఎక్కువగా తింటారు. రాత్రి 7 గంటల వరకు భోజనం ముగించేస్తారు. తరువాత ఆహారం ముట్టుకోరు. ఇలా అక్షయ్ కుమార్ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని, డైట్‌ను పాటిస్తారు. కనుకనే ఈ వయస్సులోనూ ఆయన మనకు యంగ్‌గా, ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తారు.