Heart Health | ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె పోటు సడెన్‌గా చనిపోతున్న విషయం తెలిసిందే. గుండె పోటు అనేది చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా వస్తోంది. దీంతో చాలా మంది హఠాన్మరణం పాలవుతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్‌గా వ్యాపిస్తోంది. 10 ఏళ్ల కన్నా వయస్సు తక్కువగా ఉన్నవారికి కూడా గుండె పోటు వస్తుందంటే పరిస్థితి ఎంత క్లిష్టతరంగా మారిందో అందరూ సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకని గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది.
పలు చిన్న చిన్న పనులను మనం రోజూ చేయడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో గుండె సేఫ్‌గా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులను చేయడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి ఆక్సిజన్ ఎక్కువగా వినియోగం అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు పరుగుతో కూడిన నడక చేయాలి. రోజూ వాకింగ్ చేయడం వల్ల కాస్త గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గుండెపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కీళ్లు, ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ మీరు చిన్న చిన్న దూరాలకు కూడా టూవీలర్‌ను వాడుతుంటే దానికి బదులుగా సైకిల్‌ను వాడడం అలవాటు చేసుకోండి. లేదా రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు సైకిల్‌ను తొక్కండి. దీని వల్ల పెద్ద కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండెకు మంచి వ్యాయామం అవుతుంది. పాదాలు, కాళ్లలో దృఢత్వం పెరుగుతుంది. ప్రతి రోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా గుండె పనితీరును మెరుగు పరుచుకోవచ్చు. స్విమ్మింగ్ వల్ల కీళ్లపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. స్విమ్మింగ్‌ను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల వృద్ధాప్యంలో కూడా దీన్ని రోజూ పాటించవచ్చు. దీంతో ఎక్కువ కాలం పాటు జీవించడమే కాదు, రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
రోజూ జంపింగ్ రోప్స్‌ను సాధన చేయాలి. దీని వల్ల కూడా గుండె కొట్టుకునే వేగం పెరిగి గుండెకు మంచి వ్యాయామం అవుతుంది. ఈ వ్యాయామాన్ని రోజూ కనీసం 10 నిమిషాల పాటు చేసినా చాలు చక్కని ఫలితం లభిస్తుంది. హృదయ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ డ్యాన్స్ చేయడం వల్ల కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుంబా డ్యాన్స్‌ను రోజూ చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం కాస్త సేపు పెరుగుతుంది. దీంతో చక్కని కార్డియో వ్యాయామం అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రోజూ కనీసం 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. తరచూ జాగింగ్ చేస్తే గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయాలి. ముఖ్యంగా పవర్ యోగాను రోజూ ప్రాక్టీస్ చేయాలి. దీంతో గుండె స్టామినా పెరుగుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా పలు రకాల వ్యాయామాలను తరచూ చేస్తుంటే అర్థాంతరంగా గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.