Papaya | సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది అనేక రకాల చిరుతిళ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. నూనె పదార్థాలతోపాటు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. అయితే ఆ సమయంలో తినే చాలా వరకు ఆహారం మన శరీరంలో కొవ్వుగా మారుతుంది. దీంతో అధికంగా బరువు పెరిగిపోతారు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గుండె జబ్బులు కూడా వస్తాయి. అయితే సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. ఇక సాయంత్రం స్నాక్స్ రూపంలో తినదగిన ఆహారాల్లో బొప్పాయి ఒకటి.
బొప్పాయి పండు మనకు సాధారణంగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. అందువల్ల బొప్పాయి పండును మనం రోజూ స్నాక్స్‌లాగా తినవచ్చు. రోజూ సాయంత్రం సమయంలో ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను స్నాక్స్‌లాగా తింటుండాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు సైతం తగ్గుతాయి. బొప్పాయి పండులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించబడతాయ. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
బొప్పాయి పండును తినడం వల్ల నాలుకకు సరిగ్గా రుచి వస్తుంది. ఆహార పదార్థాల రుచి పోయిన వారు బొప్పాయి పండును తింటుంటే ఫలితం ఉంటుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బద్దకంగా ఉన్నవారు బొప్పాయి పండును తింటే చురుగ్గా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. చిన్నారుల్లో తెలివి తేటలు పెరుగుతాయి. ముఖ్యంగా రాత్రి పూట మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
బొప్పాయి పండును తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. బొప్పాయి పండులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
కంటి చూపును కూడా బొప్పాయి పెంచుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బొప్పాయి చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మహిళల్లో నెలసరి సమయంలో నొప్పితో బాధపడేవారు బొప్పాయి పండును తింటే చక్కని పెయిన్ కిల్లర్ మాదిరిగా పనిచేస్తుంది. ఇలా బొప్పాయి పండును తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక సాయంత్రం సమయంలో చిరుతిండికి బదులుగా ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను తినండి. ఎన్నో లాభాలను పొందండి.