Alubukhara Fruits | ఆలుబుఖర పండ్లు మనకు చూడచక్కని ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని చూడగానే నోట్లో నీళ్లూరతాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆలుబుఖర పండ్లు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ప్లమ్ జాతికి చెందిన ఈ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆలుబుఖర పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఈ పండ్లు మనకు అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆలుబుఖర పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో సార్బిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. కనుక రోజూ సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
ఆలుబుఖర పండ్లను తినడం వల్ల ఎముకలకు ఎంతో మేలు జరుగుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం, ఆలుబుఖర పండ్లను తింటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్ కె, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, దృఢత్వానికి సహాయం చేస్తాయి. ఆలుబుఖర పండ్లలో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. శరీరంలోని వాపులు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ పండ్లలో ఉండే ఆంథో సయనిన్స్ అనే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక వీటిని తింటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
ఆలుబుఖర పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గేలా చేస్తాయి. అందువల్ల ఈ పండ్లను తింటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆలుబుఖర పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఆలుబుఖర పండ్లు మనకు తాజాగా, డ్రై ఫ్రూట్స్ రూపంలో రెండు రకాలుగా లభిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తాజా పండ్లను తినాలి. డ్రై ఫ్రూట్స్ రూపంలో ఉండే ఆలుబుఖర పండ్లను తింటే షుగర్ ఎక్కువగా లభించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక షుగర్ ఉన్నవారు ఈ పండ్లను డ్రై ఫ్రూట్స్ రూపంలో తినకూడదు. ఇలా ఆలుబుఖర పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.