ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ఆహార నియమాలు పాటిస్తుంటారు. కొన్ని రుగ్మతలు తలెత్తినప్పుడు ప్రత్యేకమైన డైట్ పాటిస్తే.. మెరుగైన ఫలితాలు ఉంటాయి. డిమెన్షియా బాధితులు మైండ్ డైట్ పాటిస్తే సమస్యను అధిగమించవచ్చని నిపుణుల మాట. MIND డైట్ అంటే మెడిటేరియన్ డ్యాష్ (డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్) ఇంటర్వెన్షన్ ఫర్ న్యూరోడీజెనరేటివ్ డిలే. ఈ మైండ్ డైట్‌ని పాటించడం వల్ల డిమెన్షియా నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి ఏడాది కోటిమంది డిమెన్షియా బారినపడుతున్నారు.
అయితే, చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల, వారి నాణ్యమైన జీవితకాలాన్ని కోల్పోతున్నారు. అలాంటి డిమెన్షియా రిస్క్‌ను తగ్గించడంలో మైండ్ డైట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ డైట్ విధానం మెదడులో కొత్త కణాల తయారీకి తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కారణం ఇందులో… ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ను తగ్గించే పోషకాలు ఉండటమే! ముఖ్యంగా ఈ డైట్ వృద్ధుల్లో కాగ్నిటివ్ ఫంక్షనింగ్‌ను మెరుగుపరుస్తుందట! డిమెన్షియాతోపాటు అల్జీమర్స్ బాధితులకు కూడా మైండ్ డైట్ సాంత్వన చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవి వైద్యుడి సిఫారసు మేరకు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఏం తినొద్దు?
వెన్న, వనస్పతి, రెడ్ మీట్, వేపుళ్లు, స్వీట్లు, పేస్ట్రీలు తినొద్దు.