శరీరంలో అన్ని భాగాలపై దాడి చేసే వ్యాధి డయాబెటిస్. ఈ వ్యాధి కారణంగా రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయులు కండ్లు, కిడ్నీలు, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ అవయవాలు మాత్రమే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాదాలకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పాదాల సమస్యలు చాలానే ఉంటాయి. దీన్నే డయాబెటిక్ ఫూట్ అంటారు. ఈ సమస్యకు నిర్ణీత సమయంలో చికిత్స తీసుకోకపోతే పాదాల్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి. కాబట్టి, పొరపాటున కూడా డయాబెటిక్ ఫూట్ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
నిజానికి మధుమేహ
వ్యాధిగ్రస్తుల్లో అధిక చక్కెర స్థాయులు కాలక్రమంలో నాడులను ధ్వంసం చేస్తాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో పాదాలకు తగినంతగా రక్త ప్రసారం జరగదు. దీంతో పాదాల్లో నొప్పి, గాయాలను గుర్తించడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు ఈ గాయాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది కూడా!
లక్షణాలు
నివారణ ఎలా?
పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. గోళ్లు కత్తిరించుకుని, శుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలపై పులిపిర్లు, గాయాలు, మంటగా ఉండటం లాంటివాటిని గమనిస్తూ ఉండాలి. పాదాలను గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. వేళ్ల మధ్య భాగాన్ని పొడిగా ఉంచుకోవాలి. పాదాలకు అసౌకర్యంగా ఉండని తగిన షూస్నే ధరించాలి. ధూమపానం చేయొద్దు. ఉట్టి కాళ్లతో నడవకూడదు. వీటికి అదనంగా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. చక్కెర స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. వైద్యుడి సలహాలను అనుసరించాలి.