Diabetes Diet | ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వంశ పారంపర్యంగా లేదా క్లోమగ్రంథి పనిచేయకపోవడం వల్ల వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ మాత్రం అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది. ఆలస్యంగా నిద్రపోవడం, లేటుగా భోజనం చేయడం, అతిగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ డైట్‌ను ఫాలో అయితే టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని, ఇది పెద్ద కష్టమేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా చేస్తే డయాబెటిస్ ను మళ్లీ వెనక్కి మళ్లించవచ్చు. ఇక మధుమేహం ఉన్నవారు మానేయాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..
వీటిల్లో మైదా, చక్కెర అధికంగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఎక్కువే. కనుక ఇలాంటి ఆహారాలను తినడం ఎవరికైనా సరే మంచిది కాదు. ఇక డయాబెటిస్ ఉన్నవారు అయితే ఈ పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీంతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. వీటికి బదులుగా మొలకలను తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్‌కు బదులుగా మొలకలను తింటే శక్తికి శక్తి, పోషకాలకు పోషకాలు రెండూ పొందవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు చాలా మంది లెక్క చేయకుండా మద్యం సేవిస్తుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి రెండు పెగ్స్ తాగితే ఫర్వాలేదు కానీ రోజూ మద్యం సేవిస్తే మాత్రం లివర్‌పై చాలా ప్రభావం పడుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తగ్గవు. పెరుగుతూనే ఉంటాయి. దీంతో డయాబెటిస్ ఎక్కువవుతుంది. మద్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా డయాబెటిస్‌కు కారణం అవుతుంది. కనుక మద్యం సేవించడం మానేయాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్‌ను రివర్స్ చేయవచ్చు.
వేయించిన ఆహారాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ ఆహారాల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. పైగా ఈ ఆహారాలను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్ ఎక్కువవుతుంది. కనుక వేపుళ్లను కూడా తినరాదు. ఇందుకు బదులుగా గ్రీన్ సలాడ్‌ను తింటే ఎంతో ఫలితం ఉంటుంది.
వైట్ బ్రెడ్, పాస్తా, మైదాతో తయారు చేసిన ఆహారాలు, నూడుల్స్ వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కావు. వీటిల్లో పోషకాలు అసలు ఉండవ. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు కన్నా కీడే ఎక్కువ. కనుక ఈ పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇలా పలు రకాల ఆహారాలకు దూరంగా ఉంటే డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చు. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.