ఎముకలు బలంగా కావాలా? ఇవి తినండి
శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.

శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి. అవే ఎముకలు బలహీనమై.. బోలు బోలుగా తయారైతే ఏ పనిచేయలేం.. చిన్న ఒత్తిడికే ఎముకలు పుటుక్కున విరిగిపోతాయి. ఆస్టియోపోరోసిస్ వల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది. ఒకప్పుడు వయసు మీద పడినప్పుడు మాత్రమే వచ్చే సమస్య ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చిన్నతనంలో వస్తుంది. అందుకే ఎముకలు బలంగా ఉండేందుకు మంచి ఆహారం తినాలి.. ఈ సమ్మర్లో దొరికే ఈ సీజనల్ పండ్లను తినడం ద్వారా కూడా ఎముకల దృఢత్వాన్ని పెంచుకోవచ్చు.. అవేంటో చూద్దాం..

పైనాపిల్
ఎండాకాలంలో దొరికే పైనాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని యాసిడ్ లోడ్‌ను నియంత్రించి.. కాల్షియం లోటును తగ్గిస్తుంది. అంతేకాకుండా పైనాపిల్‌లో విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల పుష్టికి దోహదపడుతాయి.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఎముకలు గుల్లగా మారడాన్ని అడ్డుకుంటాయి. అలాగే స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

యాపిల్
యాపిల్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరం రాదని అంటారు. ఎముకలు బలంగా ఉండేందుకు, కొత్త ఎముక కణాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడే విటమిన్ సీ ఇందులో పుష్కలంగా లభిస్తుంది.

బొప్పాయి
బొప్పాయిని కొంచెం తిన్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎముకలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ సీ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి తింటే చర్మం నిగనిగలాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది.

టమాటా
టమాటాల్లో విటమిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
రోజూ పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే..?
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే..?
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం..
చిన్నారికి జ్వరమొస్తే..
తులసి విత్తనాలు రోజూ తింటే..?
కుంకుమ పువ్వు గర్భిణులకేనా?
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

