Curd With Raisins | వేసవి కాలంలో అందరూ సహజంగానే శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందించే ఆహారాలను తింటారు. దీంతో శరీరంలోని వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా ఉండవచ్చు. అయితే వేసవిలో తినాల్సిన ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగును కచ్చితంగా రోజూ తినాలి. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా అందులో నీళ్లు కలిపి మజ్జిగలా చేసి కూడా తీసుకోవచ్చు. అయితే పెరుగులో కిస్మిస్లను కలిపి తింటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులో వీటిని కలిపి తినడం వల్ల అనేక పోషకాలు లభించడమే కాదు, వేసవిలో మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. పెరుగులో కిస్మిస్లను కలిపి తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగులో కిస్మిస్లను కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. పెరుగు, కిస్మిస్ల మిశ్రమం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే మేలు జరుగుతుంది. పెరుగు, కిస్మిస్లు రెండింటిలోనూ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఈ మిశ్రమాన్ని తింటే ఎముకలు, దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ మిశ్రమాన్ని తింటుంటే త్వరగా ఎముకలు అతుక్కునేలా చేయవచ్చు. ఎముకలు బలంగా మారుతాయి.
పెరుగు, కిస్మిస్ల మిశ్రమంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది. పెరుగు, కిస్మిస్ల మిశ్రమం తినడం వల్ల శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ సైతం పెరుగుతాయి. రక్తహీనత తగ్గుతుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహం లభిస్తుంది. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. కండరాలు నిర్మాణమవుతాయి. దేహం దృఢంగా ఉంటుంది.
పెరుగు కిస్మిస్ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా పెరుగు, కిస్మిస్ మిశ్రమంతో అనేక లాభాలను పొందవచ్చు. ఒక కప్పు పెరుగులో 2 టీస్పూన్ల కిస్మిస్లను వేసి కలిపి తినాలి. వీలుంటే కాసేపు పెరుగులో కిస్మిస్లను నానబెట్టి తింటే మంచిది. అయితే అలర్జీలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తినకపోవడమే మంచిది.