పెరుగు ప్రపంచమంతటా బాగా ప్రాచుర్యంలో ఉన్న ఆహార పదార్థం. ఎన్నో పోషకాలను కలిగిన పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పొట్ట ఆరోగ్యానికి కూడా సహకరించే పెరుగును ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. దీనికీ ఓ సమయం అంటూ ఉంది. పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ కొద్ది పరిమాణంలో ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాలు సవ్యంగా పనిచేయడానికి ఇవి దోహదపడతాయి.
పెరుగు తినడానికి మధ్యాహ్న సమయం… అదీ భోజనం తర్వాత అనువైనది. తిన్న తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల అరుగుదల సాఫీగా జరిగిపోతుంది. శరీరానికి మరింత శక్తి లభిస్తుంది.పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ పొట్టలో మంచి బ్యాక్టీరియాను సమతూకంలో ఉంచుతాయి. పొట్ట ఆరోగ్యానికి మేలుచేస్తాయి.ఇక రాత్రిళ్లు పెరుగు తినకూడదు. ఇది
నిద్రకు చేటుచేస్తుంది. పొట్టలో సమస్యలకు కారణమవుతుంది.